పేదల కోసమే సీఎం రిలీఫ్ ఫండ్ నిధి టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు లింగాల రమణారెడ్డి
ములుగు బ్యూరో,ఆగస్ట్02(జనం సాక్షి):ములుగు జిల్లావెంకటాపూర్ మండలం నల్లగుంట గ్రామంలో మంగళ వారం రోజున మండల అధ్యక్షులు లింగాల రమణారెడ్డి, జెడ్పిటిసి గై రుద్రమదేవి అశోక్,ఎంపీపీ బుర్ర రజిత సమ్మయ్య,సీనియర్ నాయకులు గోవింద నాయక్,గ్రామ సర్పంచ్ మందల సుచరిత శ్రీధర్ రెడ్డితో కలిసి గ్రామానికి చెందిన ఆర్.వెంకటేష్ కి 37,500 రూపాయలు సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కును లబ్ధిదారునికి అందజేశారు.అనంతరం రమణారెడ్డి మాట్లాడుతూ అత్యవసర సమయంలో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుని పేదలను ఆదుకోవడం కోసమే ముఖ్యమంత్రి సహాయ నిధి లక్ష్యమని అన్నారు.అత్యవసర సమయంలో ప్రవేట్ ఆస్పత్రిలో వైద్య సేవలు పొంది హార్దిక ఇబ్బందులతో సతమతమవుతున్న కుటుంబాలను ఆదుకోవడానికి ముఖ్యమంత్రివర్యులు సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారని అన్నారు..ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మండల సుచరిత శ్రీధర్ రెడ్డి, ఉప సర్పంచ్ బుక్య శంకర్,మందల మధుకర్ రెడ్డి,యువజన నాయకులు జనగాం రవి, మేడారం ట్రస్ట్ బోర్డ్ డైరెక్టర్ ఆదిరెడ్డి, నాయకులు మధుసూదన్ రెడ్డి, సంజీవరెడ్డి, సమ్మిరెడ్డి, రణధీర్ రెడ్డి,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.