పేద పిల్లలకు ఆంగ్ల విద్య
– నూతనంగా 250 గురుకులాలు
– డిప్యూటీ సీఎం కడియం
హైదరాబాద్,ఏప్రిల్ 15(జనంసాక్షి):తెలంగాణలోని ప్రతీ పేదింటి బిడ్డకు కేజీ నుంచి పీజీ వరకు ఇంగ్లీష్ విూడియంలో విద్యను అందిస్తామని డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ప్రకటించారు. ఇందుకోసం ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. తెలంగాణ భవన్‌లో కడియం విూడియాతో మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థుల కోసం 250 గురుకులాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఒక్కో గురుకుల పాఠశాలకు రూ. 20 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. 6 వేల మంది టీచింగ్ స్టాఫ్, 4 వేల మంది నాన్ టీచింగ్ స్టాఫ్ అవసరం ఉందన్నారు. దీనికోసం పదివేలమందికి ఉదోయోగావకాశాలు రానున్నాయని అన్నారు. అక్షరాస్యతలో తెలంగాణ చాలా వెనుకబడి ఉందని వెల్లడించారు. అందరికీ విద్యావకాశాలు కల్పించినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. అక్షరాస్తయత సాధించడం, వెనకబడిన తరలగులకు విద్య చెప్పిండం బాధ్యతగా స్వీకరిస్తున్నామని అన్నారు. అందుకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల కోసం 250 గురుకుల పాఠశాలలు ప్రారంభిస్తామని తెలిపారు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. వీటిలో సుమారు 1.6 లక్షల విద్యార్ధులకు ప్రవేశం కల్పిస్తామని, ఒక్కో పాఠశాలలో 600 మంది స్టూడెంట్స్‌కు అవకాశం ఉంటుదని తెలిపారాయిన. ఈ గురుకుల పాఠశాలల నిర్మాణానికి 5వేల కోట్ల వెచ్చించనున్నట్టు తెలిపారు. అట్టడుగు వర్గాల పిల్లలకు చక్కటి విద్యనందించడం కోసం 250 గురుకుల పాఠశాలలు ఏర్పాటు ఎంతగానో దోహదపడగలదని అన్నారు. ఇది హర్షణీయమని టీఆర్‌ఎస్ ఎంపీ బాల్క సుమన్ అన్నారు. తెలంగాణ భవన్‌లో సుమన్ విూడియాతో మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటారని చెప్పారు. సీఎం నిర్ణయాన్ని అన్ని వర్గాల ప్రజలు హర్షిస్తూ అభినందిస్తున్నారని తెలిపారు. కొన్ని పార్టీల నేతలు కావాలనే రాద్ధాంతం చేస్తున్నారని ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్ ఏ నిర్ణయం ప్రకటించినా, ఏ మంచి పని చేసినా వాళ్ల భవిష్యత్ ప్రశ్నార్థకమైతదనే వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు. కేసిఆర్‌ను చూసి కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని బాల్కసుమన్ అన్నారు. సీఎం కేసిఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా కొందరికి పడటంలేదని అన్నారాయన. గతపాలకులు వాళ్ల అభివృద్ధే చూసుకున్నారని, కేసీఆర్‌ను విమర్శిస్తూ రాజకీయపబ్బం గడుపుకుంటున్నారని ఆరోపించారు. భవిష్యత్ ఉండదే ఇలాంటి లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని బాల్కసుమన్ విమర్శించారు. ఇదిలావుంటే రంగారెడ్డి జిల్లాలో 9 మైనార్టీ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నట్లు రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి ప్రకటించారు. రూ. 18 కోట్ల నిధులతో భవనాలు నిర్మిస్తామని తెలిపారు. ప్రతీ పాఠశాలకు 5 ఎకరాల స్థలం కేటాయిస్తామన్నారు. జిల్లాలో అవసరమైన చోట గిరిజన గురుకుల పాఠశాలల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.