*పేద బడుగు బలహీన వర్గాల ఆశజ్యోతి ఎమ్మెల్యే చందూ నాగేశ్వరావు*
కోదాడ, ఆగస్టు 14(జనం సాక్షి)
చందు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలు ప్రజాప్రతినిధులు నడుమ కేక్ కట్ చేసి పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించారు. అనంతరం శనగల రాధాకృష్ణ మానసిక వికలాంగుల కేంద్రంలో మార్కెట్ కమిటీ కార్యాలయం ముందు పేదలకు భారీ స్థాయిలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు నోటు పుస్తకాలను రాత సామాగ్రిని పంపిణీ చేశారు. అనంతరం పట్టణంలోని పలు వార్డుల్లో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పేదల పెన్నిధి కావడంతో ప్రతి వాడవాడనా పేదలందరూ ఎమ్మెల్యే జన్మదినాన్ని పండుగ మాదిరిగా నిర్వహిస్తున్నారని అన్నారు.రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే బొల్లం ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అన్నారు. వారు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించి ప్రజలకు మరింత కాలం సేవ చేయాలని వారు ఆకాంక్షించారు. భారీ ఎత్తున సేవా కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ కౌన్సిలర్లకు నాయకులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చింత కవితారెడ్డి, ఎంఈఓ సలీం షరీఫ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర సుధారాణి పుల్లారెడ్డి, కౌన్సిలర్లు కల్లూరి పద్మజ, మొయినుద్దీన్, కమదాన చందర్రావు,పట్టణ ఉపాధ్యక్షురాలు తాళ్లూరి లక్ష్మి, సుధారాణి, సూర్యదేవర మాధవి, గంధం పాండు, మౌలానా, వెంకటరత్నం, తదితరులు పాల్గొన్నారు.