పొగాకు లాబీకి తలొగ్గం

4

బీడీ, సిగరెట్‌ కట్టలపై డేంజర్‌ మార్క్‌ 65శాతం పెంపుకు ఆదేశం

ప్రధాని నరేంద్ర మోదీ

బెంగళూరు,ఏప్రిల్‌4(జనంసాక్షి):పొగాకు లాబీకి  తలొగ్గేది లేదని ప్రధాని స్పష్టం చేసిన్రు. బీడీ, సిగరెట్‌ కట్టలపై హెల్త్‌ వార్నింగ్‌ లోగో సైజు 65 శాతానికి పెంచుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  కేంద్ర ఆరోగ్య శాఖకు ఆదేశాలు జారీ చేశారు.  ఈ మేరకు ఆరోగ్యశాఖ మంత్రి జేఎన్‌ నద్దాను  తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించిన్రు. ఇక బీజేపీ

మంత్రుల వరుస వివాదాస్సద  కామెంట్ల తరువాత ప్రధానమంత్రి స్పందించారు.  పార్లమెంటరీ కమిటీ సూచించినట్టుగా పొగతాగడం వల్ల  కాన్సర్‌ రాదనడానికి ఆధారాలు లేవని ఆయనన్నారు. బెంగళూరులో జరుగుతున్న పార్టీ జాతీయ సమావేశాల్లో ఈ విషయాన్ని  ప్రధాని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. కాగా సిగరెట్‌ తాగితే కేన్సర్‌ వస్తుందని భారత్‌లో ఏ పరిశోధన కూడా ధ్రువీకరించలేదని, అలా అనుకోవటం మూర్ఖత్వమని పార్లమెంటరీ కమిటీ సభ్యుడు, బీజేపీ ఎంపీ దిలీప్‌ కుమార్‌ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.  అలహాబాద్‌ ఎంపీ శ్యామ చరణ్‌ గుప్తా, మరో బీజేపీ ఎంపీ రామ్‌ ప్రసాద్‌ శర్మ కూడా సిగరెట్‌ తాగడం వల్ల క్యాన్సర్‌ రాదంటూ, వార్నింగ్‌ లోగో సైజు పెంచడాన్ని వ్యతిరేకించారు.  దీంతో బీజేపీ సర్కారు చిక్కుల్లో పడింది. పొగాకు ఉత్పత్తులన్నింటిపైనా హెచ్చరిక చిహ్నాలు 85శాతం మేర ముద్రించాలంటూ కేంద్ర వైద్య ఆరోగ్య  శాఖ ఇటీవల నోటిఫికేషన్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. నిజానికి ఏప్రిల్‌ ఒకటి నుంచే ఈ ఆదేశాలు అమలు కావాల్సి ఉంది. అయితే ఇప్పుడు మళ్లీ దాన్ని 65 శాతమే చేయడంతో పొగాకు

లాబీకి తలొగ్గారా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.