పొడు సమస్యలపై సమీక్ష సమావేశం.

నెరడిగొండ సెప్టెంబర్23(జనంసాక్షి):
ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న పొడు భూముల సమస్యల పరిష్కారానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని డీపీఓ శ్రీనివాస్ అన్నారు.శుక్రవారం మండల కేంద్రంలోని ఎంపిడివో సమావేశ మందిరంలో అటవీశాఖ పంచాయతీ రాజ్ రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పొడు భూముల సర్వే కోసం ఏర్పాటు చేస్తున్న బృందాల నిర్వాహణ పట్ల అధికారులకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా అటవీశాఖ రేంజ్ అధికారి గణేష్ మాట్లాడుతూ మండల వ్యాప్తంగా పొడు భూముల పట్టా కోసం దరఖాస్తులు చేసుకున్న లబ్ధిదారుల వివరాలను క్షేత్రస్థాయిలో పర్యటించి  సర్వేను నిర్వహించాలాని కోరారు.గ్రామ పంచాయతీ కార్యదర్శి అటవీశాఖ అధికారి రెవెన్యూ అధికారి గ్రామ ఆర్ ఓ ఎఫ్ ఆర్ సభ్యులు బృందాలగా ఏర్పడి సర్వేలో ఎలాంటి అవకతవకలు జరగకుండా పకడ్బందీగా నిర్వహించాలన్నారు.ఈ కార్యక్రమంలో తహశీల్దార్ పవన్ చంద్ర ఎంపిడిఓ అబ్దుల్ సమద్ ఎంపిఓ శోభన ఆర్ఐ నాగరావు అధికారులు జీపీ సెక్రెటర్లు అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు.