పొద్దుటూరులో వరుణ యాగం

కడప, జూలై 11 : రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితుల నుంచి రైతాంగాన్ని, ప్రజలను కాపాడాలని కోరుతూ ఈ నెల 15న పొద్దుటూరులో వరుణ యజ్ఞంను నిర్వహిస్తున్నట్లు ఆర్య సమాజ యజ్ఞ నిర్వహకులు రాజ ఆర్య ఒక ప్రకటనలో చెప్పారు. పొద్దుటూరులోని దొరసానిపల్లెలో ఉన్న వైభవ్‌ కల్యాణ మండపంలో ఈ యజ్ఞం నిర్వహిస్తామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడక రైతులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. యజ్ఞాల వల్ల చాలా ప్రయోజనాలు వనకూరుతాయని చెప్పారు. యజ్ఞం విజయవంతం అయ్యేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. ప్రజల పెద్ద సంఖ్యలో యజ్ఞానికి హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు.