పోడు భూములపై ముఖ్యమంత్రి మాట నిలబెట్టుకోవాలి

రాష్ట్ర గిరిజన సమాఖ్య కార్యవర్గ సభ్యులు నాయకులు రామచందర్

టేకులపల్లి, సెప్టెంబర్ 14( జనం సాక్షి): పోడు భూములపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని తెలంగాణ గిరిజన సమాఖ్య రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుగులోత్ రామచందర్ అన్నారు.టేకులపల్లి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజనుల సాగులో ఉన్న పోడు భూములకు హక్కు పత్రాలు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా 140 జీవో తీసుకురావడానికి హర్షిస్తున్నామని, కమిటీల పేరుతో కాలయాపాన చేయకుండా తక్షణం గిరిజన గ్రామాల్లో సాగులో ఉన్న పోడు భూములు సర్వే చేసి పట్టాలు ఇవ్వాలని కోరారు. గతంలో గ్రామసభలు పెట్టి దరఖాస్తులు తీసుకొని బుట్ట దాఖలు చేసినా విధంగా 140 జీవో ఉండకూడదని గిరిజన రైతాంగం పట్ల తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని పోడు భూమి సాగుదారులకు న్యాయం చేసే విధంగా ఉండాలని, ప్రతి గ్రామంలో సిపిఐ కార్యకర్తలు గిరిజన సమాఖ్య ఆధ్వర్యంలో పోడు భూమి సాగుదారులు సమస్యలను కమిటీల దృష్టికి తీసుకువెళ్లి హక్కు పత్రాలు సాధించాలని పిలుపునిచ్చారు. అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేసి ప్రభుత్వం చిత్తశుద్ధి నిరూపించుకోవాలని జీవోల పేరుతో కమిటీలు పేరుతో కాలయాపన చేస్తే పోరాటం తప్పదని అన్నారు.