పోరు ఆగదు

2

భూసేకరణ బిల్లు ఉపసంహరించాల్సిందే..సోనియా

న్యూదిల్లీ,మార్చి27(జనంసాక్షి): ఎన్డీఏ సర్కార్‌ తీసుకొచ్చిన భూసేకరణ బిల్లుపై అఖిల భారత కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ కన్నెర్ర చేశారు. ఇప్పటికే ఈ బిల్లుకు వ్యతిరేకంగా పలుమార్లు నిరసన తెలిపిన ఆమె.. తాజాగా, కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీకి లేఖ రాశారు. భూ సేకరణ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. కేంద్రం ప్రవేశపెట్టిన ఈ బిల్లు రైతుల ప్రయోజనాలకు పూర్తి వ్యతిరేకంగా ఉందని విమర్శించారు. ఈ విషయంలో కేంద్రం మొండి వైఖరితో ముందుకు వెళితే.. పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఎన్‌డీఏ తెచ్చిన భూసేకరణ బిల్లు ఉపసంహరించేవరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు.