పోలీసు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి దర్బార్
విజయనగరం, జూన్ 28 : జిల్లా పోలీస్ శాఖలో పనిచేయుచున్న ఆర్మ్‌డ్ రిజర్వు స్పెషల్ పార్టీ పోలీసులు ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి జిల్లా ఎస్పీ కార్తికేయ స్థానిక శ్రీదేవి దండుమారమ్మ కళ్యాణ మండపంలో దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసు ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆర్మ్‌డ్ రిజర్వు కానిస్టేబుళ్ళు, స్పెషల్ పార్టీ పోలీసులు తాము ఉద్యోగ రీత్యా, వ్యక్తిగతంలో ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు. ఈకార్యక్రమంలో ఎఎస్పీ టి.మోహనరావు, ఆర్మ్‌డ్ రిజర్వు డిఎస్పీ బి.రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.