పోలీస్‌ కూంబింగ్‌పై మావోయిస్టుల కాల్పులు

1

ఏడుగురు జవాన్ల మృతి

రాయ్‌పూర్‌,ఏప్రిల్‌11(జనంసాక్షి): ఛత్తీస్‌గడ్‌లో మావోయిస్టులు మరోసారి చెలరేగిపోయారు.  బస్తర్‌ ప్రాంతంలోని సుక్మా జిల్లాలో పోలీసులపై కాల్పులకు తెగబడ్డారు. కూంబింగ్‌ జరుపుతున్న జవాన్లపై మావోలు కాల్పులకు తెగబడ్డారు. ఇందులో కనీసం ఏడురుగు మరణించినట్లు సమాచారం.

సుకుమా జిల్లా పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఏడుగురు జవాన్లు మృతిచెందారు. పది మంది ఎస్‌టీఎఫ్‌ సిబ్బంది గాయపడ్డారు. ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు అప్రమత్తమయ్యారు. కాల్పులు జరిగిన ప్రాంతానికి రెండు సీఆర్‌పీఎఫ్‌ బలగాలు చేరుకుని మావోయిస్టుల కోసం ముమ్మరంగా గాలింపు చేపట్టారు. కాల్పుల్లో గాయపడిన క్షతగాత్రులను రెండు హెలికాప్టర్లలో జగ్దల్‌పూర్‌ ఆస్పత్రికి తరలించారు.  ఈ దాడిలో ఏడుగురు పోలీసులు మృతిచెందారని అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ ఆర్‌కే విజ్‌ ఈ విషయాన్ని విూడియాకు తెలిపారు. ఈ ఘటనలో 12 మంది పోలీసులు తీవ్రంగా గాయపడగా వారిని కాంచన్‌కాలాలోని ఎ/-టసీఎఫ్‌ ఆసుపత్రికి తరలించామన్నారు. కూంబింగ్‌లో భాగంగా భద్రతాదళాలు జిల్లాలోని పెద్మల్‌ అటవీప్రాంతంలో వుండగా నక్సల్స్‌ చుట్టుముట్టినట్టు తెలిసింది. వెంటనే తేరుకున్న భద్రతాదళాలు వీరి దాడిని తిప్పికొట్టేందుకు యత్నించారు. దాదాపు రెండు గంటల పాటు జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఏడుమంది పోలీసులు ప్రాణాలు కోల్పోగా 12 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే ప్రభుత్వ యంత్రాంగం గాయపడిన భద్రతాసిబ్బందిని రెండు హెలిక్టాపర్లలో జగదల్‌పూర్‌ ఆసుపత్రికి తరలించింది.