*పౌర హక్కులపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలి*

– ఇంచార్జ్ తహసిల్దార్ నాగేశ్వరరావు

మునగాల, సెప్టెంబర్ 30(జనంసాక్షి): పౌర హక్కులపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని నాయబ్‌ తహసీల్దార్‌ నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని బరాఖత్ గూడెం గ్రామంలో నిర్వహించిన పౌరహక్కుల దినోత్సవం సందర్భంగా గ్రామస్తులకు అధికారులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారత రాజ్యాంగం పౌరులందరికి సమాన హక్కులు కల్పించిందన్నారు. ప్రజలు పౌర హక్కులపై అవగాహన కలిగి ఉన్నప్పుడే సమాజంలో మార్పు వస్తుందన్నారు. గ్రామ సర్పంచ్ వీరమ్మ మాట్లాడుతూ, కుల వివక్ష లేకుండా గ్రామంలో అందరూ సోదర భావంతో కలిసి మెలిసి ఉండాలన్నారు. గ్రామాల్లో అంటరానితనం వంటి అమానుషమైన చర్యలకు పాల్పడే వ్యక్తులపై చట్టపరమైన చర్యలుంటాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ సంజీవరావు, ఆయా కులసంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.