ప్రజలకు సురక్షిత మంచి నీరు అందించడంలో తెలంగాణ దేశానికే ఆదర్శం

C

-టెండర్ల విధానంలో మార్పులు

-వాటర్‌ గ్రిడ్‌ పథకంపై విస్త్రతంగా చర్చించిన సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌,ఏప్రిల్‌ 20 (జనంసాక్షి):  రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వాటర్‌గ్రిడ్‌ నిర్మాణం పట్ల యావత్‌ దేశం ఆసక్తిగా ఎదురు చూస్తుందని సీఎం కేసీఆర్‌ తెలిపారు. సచివాలయంలో వాటర్‌గ్రిడ్‌పై సీఎం కేసీఆర్‌ అన్నారు. వాటర్‌గ్రిడ్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సవిూక్ష సచివాలయంలో నిర్వహించారు.       నీటి పారుదల శాఖ టెండర్ల నిబంధనల్లో మార్పులు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్థానిక గుత్తేదారులకు వెసులుబాటు కల్పించేలా నిబంధనలను సవరణ చేసింది. గత అనుభవానికి సంబంధించి పనుల మొత్తంలో కుదింపు చేసింది. గుత్తేదారులకు ఆర్థిక పరిమితిని ప్రభుత్వం పెంచింది.  ప్రజలకు సురక్షిత మంచినీరు అందించడంతో పాటు అన్ని రాష్టాల్రకు ఆదర్శంగా నిలిచే విధంగా ప్రాజెక్టును పూర్తి చేయాలన్నారు.    ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ వాటర్‌గ్రిడ్‌ 26 ప్యాకేజీల్లో 17 ప్యాకేజీలకు మరో వారంలో టెండర్ల పని పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. వాటర్‌గ్రిడ్‌లో ప్రముఖ సంస్థలు పాల్గొనేలా ప్రచారం చేయాలని సూచించారు. నాలుగైదు విభాగాలుగా విభజించి పర్యవేక్షించాలన్నారు. అయితే 315చోట్ల రైల్వేలైన్లు అడ్డు వస్తున్నాయంటూ అధికారులు సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు. 3,4 రోజుల్లో రైల్వే అధికారులను కలిసి అనుమతి  తీసుకోవాలని అధికారులకు సీఎం సూచించారు.నల్లగొండ జిల్లాలోని ఫ్లోరైడ్‌ పీడిత ప్రాంతాలకు, కరువు పీడిత మహబూబ్‌నగర్‌ జిల్లాకు మొదటగా మంచి నీరు అందించాలి. పనులు వేగంగా, పారదర్శకంగా జరగాలన్నారు.  వివిధ స్థాయిల్లో వాటర్‌గ్రిడ్‌ పైపులైన్లకు 311 చోట్ల రైల్వే లైన్లు అడ్డు వస్తున్నాయని సీఎం కేసీఆర్‌ దృష్టికి అధికారులు తీసుకొచ్చారు. ఈ విషయంపై దక్షిణ మధ్య రైల్వే జీఎం శ్రీవాత్సవతో సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. పైపులైన్లు రైల్వే లైన్‌ క్రాస్‌ చేయడానికి అనుగుణంగా నిర్మాణాలకు అనుమతులు ఇవ్వాలని రైల్వే జీఎంను సీఎం కోరారు. రెండు, మూడు రోజుల్లో రైల్వే శాఖ, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సమావేశం కానున్నారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా, సవాలుగా తీసుకుని వాటర్‌గ్రిడ్‌ నిర్మాణం చేపడుతున్నది. అధికార యంత్రాంగం కూడా అదే పట్టుదలతో పని చేయాలి. 15 రోజుల్లోగా టెండర్ల పక్రియ పూర్తి చేయాలి. దేశంలోని అన్ని ప్రముఖ సంస్థలు టెండర్లలో పాల్గొనే విధంగా విస్తృత ప్రచారం కల్పించాలి. 26 ప్యాకేజీలను నాలుగైదు భాగాలుగా విభజించుకుంటే పనులను సవిూక్షించడం సులువుగా ఉంటుంది. పనులలో వేగం పెంచడంతో పాటు నాణ్యత విషయంలో కూడా రాజీ పడొద్దు. సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు రూపొందించిన తర్వాత ఎక్స్‌పర్ట్‌ కమిటీకి కూడా పరిశీలన కోసం పంపి సూచనలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే వాటర్‌గ్రిడ్‌ కోసం పలు సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయి. ప్రభుత్వం కూడా ఎంత ఖర్చు అయినా పెట్టడానికి సిద్ధంగా ఉంది. హడ్‌కో, నాబార్డు నుంచి ఇప్పటికే రూ. 13 వేల కోట్ల రూపాయాల పెట్టుబడులు రావడానికి ఒప్పందాలు కుదిరాయి. ఈ సంస్థలే మరో 7 వేల కోట్ల రూపాయాల పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. ఇతరత్రా నిధులు కూడా వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా కొంత మేర నిధులు అందుతాయి. ఎక్కడ నిధులు అవసరమైనా సమకూర్చడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సిఎం వివరించారు. సవిూక్ష సమావేశంలో మంత్రి కెటిఆర్‌, చీఫ్‌ సెక్రటరీ రాజీవ్‌ శర్మ తదితరులు పాల్గొన్నారు.