ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ఎస్సై కురుమూర్తి
జనం సాక్షి, :
నాలుగు రోజుల నుంచి ఎడతెరపు లేకుండా కురుస్తున్న ముసురు వానలకు ప్రజల అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి ఆపద వచ్చిన అత్యవసర సమయంలో వెంటనే 100 కి డయల్ లేదా పోలీస్ కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ 9440 900910 కు సమాచారo ఇవ్వాలని ఎస్సై ఒక ప్రకటనలో తెలిపారు. మట్టి ఇళ్లలో, పురాతన ఇళ్లలో నివసించే వారు మరింత జాగ్రత్తలు పాటించాలని, సాధ్యమైనంతవరకు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించారు. వర్షాలు కురుస్తున్నందున ఎవరు కూడా కరెంటు స్తంభాలను తాకొద్దని, పాడుబడ్డ ఇళ్లలో ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, రైతులు మీ వ్యవసాయ బావుల వద్ద, బోరు ల వద్ద కరెంటు పెట్టే తడిసిన స్టార్టర్ బాక్స్ లను చేతులతో ముట్టుకోవద్దని అదేవిధంగా మృత్తు కారులు చేపల వేటకు వెళ్లరాదని తగు జాగ్రత్తలు పాటించి అప్రమత్తంగా ఉండాలని ఎస్సై కురుమూర్తి తెలిపారు.