ప్రజల మనిషి – కేవత్ కిషన్ – తొలి తరం వీరుడు
1947 సెప్టెంబర్ 2న హైదరాబాద్ సంస్థానమంతా భారతదేశ స్వాతంత్య్ర త్రివర్ణ పతాకమును ఎగురవేసి సభలు, సమావేశాలు జరిపారు. తెలంగాణ సయుధ పోరాటంలో పాల్గొ న్న ప్రజా ఉద్యమకారులను నిజాం పోలీసులు లాఠీచార్జ్ జరిపారు. కొంత మంది ఉద్యమకారులు అసువులు బాసారు. ఆ రోజు అనేక మంది ప్రజలు తీవ్ర నిర్భందాలకు గురైనారు. కేవల్ కిషన్ ఆరోఉలో మెట్రిక్కులేషన్ వరకు చదివాడు, ఉన్నతమైన కుటుంబం నుంచి కమ్యూనిస్టు రాజకీయంలోకి వచ్చాడు. ప్రజాకవి, తొలితరం కమ్యూనిస్టు యోధుడు ట్రెడ్ యూనియన్ నాయకుడు మగ్ధుం మొహిద్దున్‌తో కేనల్ కిషన్‌కు విడదీయరాని బంధం ఉండేది. ఒక విదంగా చెప్పాలంటే మగ్ధుం చొరవతోనే కేవల్ కిషన్ ప్రజా ఉద్యమాలలో క్రియాశీల పాత్ర నిర్వహించారు. కేవల్ కిషన్ మెతుకు లేని మెదక్ జిల్లాలో పల్లె పల్లె గుడిసె గుడిసె తీగలాగా అల్లుకుంటూ అన్ని వర్గాల ప్రజలను పీడిత తాడిత కూలీ జనులను సమీకరించడంలో ఎప్పుడు ప్రజలతో మమైకం అయి పోరాడేవాడు. ప్రజలందరిని ప్రేమతో ఆప్యాయంగా పలకరించే వాడు. భూ సంస్కరణలు అమలు జరిపితే గిరిజనుల కష్టాలు తొలగిపోతాయని ప్రజల్లో చైతన్యం నింపుతూ పటేలు, పట్వారీల నుంచి భూమి రికార్డులు తగుల బెట్టుకుంటూ ఉద్యమాన్ని మరింత ముందుకు నడిపాడు. ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. పగలనక రకేయనక గిరిజనతలతో కలిసి మెలసి గిరిజనులు పెట్టిన గంజి, గడ్క తింటూ కలిసిపోయాడు. అప్పటికి కేవత్ కిషన్‌కు వివాహం అయింది. కొద్దికాలనికి గర్భం దాల్చింది. అయిన ఆమె చింతపడలేదు. భర్త కేవత్ కిషన్ నిర్వహించే ప్రజా ఉద్యమానికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తూ వచ్చింది. ఉదయం 5 గంటలకు కేవల్‌కిషన్ ఇంటినిి వదిలి వెల్లాడంటే నెల వరకు ఇంటికి వచ్చేవాడు కాదు. కేవల్ కిషన్, భార్య, ఇద్దరు పడిన బాధలు అన్నీ ఇన్నీ కావు. మరీ చెప్పాలంటే నిజమయిన గొప్ప దేశభక్తుడు పోరాట యోధుడిని తన గుండెలో ఉంచుకుని అసలుసిసలైన ఉద్యమకారుని భార్య అనిపించుకుంది. మెతుకు జిల్లాలో నిజాం నవాబు కాళ్లకింద నలిగిపోతున్న జిల్లా అది. క్రూరమైన నిర్భంధం, అణచివేతలు, వెట్టిచాకిరి, నిత్యదొపిడీలు విశ్వరూపం దాల్చాయి. భూస్వామ్య దొరలయినా పట్వారులు, గ్రామాధికారులు సలాం సలామంటు చెప్పులు విడిచి వంగి వంగి సలాములు చేస్తు బంచన్ బతుకులు బతుకుతున్నారు. తినడానికి తిండిలేక ఉండడానికి నీడ లేక కట్టుకోడానికి బట్టలేక, తాగడానికి నీళ్లు లేక వెట్టిచాకిరి బతుకులు బతుకుతున్నారు. దొరలు, భూస్వాములు, నవాబుల వద్ద వందల ఎకరాల భూమి ఉంది. అందులో కొంత భూమిలో మాత్రమే రైతు కూలీలు భూమిని సాగు చేస్తున్నారు. పగలనక, రేయనక రెక్కలను ముక్కలుగా చేసుకుని ఆరుగాళం రైతు కూళీలు తమ శ్రమను దారపోసుకుంటూ దుర్భరమైన జీవితాలను గడుపుతున్నారు. రైతు కూళీలు పొద్దున కోడి కూయకముందే ఇంటి నుండి పరుగెత్తి మొటలు కొట్టి, పొలాలను పారించి, పుట్ల కొలది పంటలు పండించి ధాన్యపు రాశులతో దొరల, భూస్వాముల గడీలీఉ నింపేవాళ్లు. పుట్ల కొలది పంటలు పండించే రైతులు పూటపూటకు సుడిగుండమైన బతుకు లు బతుకుతున్నారు. పగలు, రాత్రి అని ఏమి ఉండదు, రైతు కూలీల బతుకులు నిండు అమావాస్య. ఆకలితో అలమటించేవాళ్లు. దొర, భూస్వాముల పోకడలు మితిమీరి పోయాయి. ఎంతసేపటికి రైతుల బతుకులు దొరల, భూస్వాముల కాళ్ల కింద నలిగిపోతు న్నాయి. ఆ రోజుల్లో ఒక వైపు దొరల, భూస్వాముల పెత్తనానికి వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ నాయకులు కేవత్ కిషన్, ఎడ్ల గురువారెడ్డి, ముగ్ధుం మొహినుద్దీన్, నందిని, బాలసిధారెడ్డి, వంగ అనంత రెడ్డి, చిలుమల విఠల్ రెడ్డిలు, భూస్వామ్య దొరలకు పోరాటాన్ని ప్రారంభించారు. ఈ పోరాటానికి మహనీయులు తెలంగాణ సాయుధ పోరాట విప్లవ సేనానిలు మగ్ధుం మొహీనుద్దీన్, ఆరుట్ల రాంచంద్రారెడ్డిలు గైడ్ చేస్తున్నారు. జనగామ తాలుకలో ఉస్నూర్ దేశ్‌ముఖ్‌లకు వ్యతిరేకంగా పెద్దపెట్టున పోరాట ం ఉవ్వేత్తున ఎగిసిపడుతుంది. ప్రజలే స్వయంగా గ్రామ రక్షక దళాలను ఏర్పాటు చేసుకుని ప్రజలను రక్షించారు. నైజాం అల్లరి మూకలను తరిమేశారు. పొద్దంతా రజాకర్లు, రాత్రంతా కమ్యూనిసు ్టలు జోరు ఉండేది.
ఏడు పాయల నీటి ఊటలాగా పల్లే పల్లేలో ప్రవహించి నాగేటి సాల్లల్ల, విత్తనాలు వెదజల్లి, మొక్కలై, వృక్షాలై వీస్తున్నాయి సుడిగాలులు. కేవత్ కిషన్ దొర భూస్వాములక వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాన్ని నిర్మంచడంలో ఎంతో శ్రమించారు. దొరల, భూస్వాముల చేతిలో అంత భూమి ఎందుకుండాలే, ఆ భూమిని పేదలకు పంచినట్లయితే పేదరికం ఆకలి తీరుతుందని గ్రామ గ్రామాన తిరుగుకుంటూ ప్రజలలో చైతన్యాన్ని నింపాడు. దొర, భూస్వాములు మాత్రం ఉద్యమాన్ని అణచివేయడానికి ఎన్నో కుట్రలు చేసారు కాని చివరకు విఫలమయ్యారు. ఎన్ని కష్టాఉ ఎదురయిన వాటిని ఎదిరిస్తూ ఉద్యమాన్ని మరింత ముందుకు నడిపిస్తున్నారు. పోలీసులతో దొర, భూస్వాములు ఉద్యమాన్ని అణచివేయడానికి ప్రయత్నించారు, కాని తిప్పికొట్టారు. వారి భూముల్లో ఎర్ర జెండాలు రెపరెపలాడుతున్నాయి. ప్రజా ఉద్యమాలకు భయపడి దొర, భూస్వాములు ఊళ్లు విడిచి వెళ్లి పోయారు. కేవత్ కిషన్ నాయకత్వంలో 150 ఎకారాల భూమిని పేదలకు పంచి రైతుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. కక్ష్యగట్టిన దొర, భూస్వాములు కేవత్ కిషన్‌ను చంపాలని, ప్రజలనుండి దూరం చేయాలని కుట్రలు పన్నారు. ఆ కుట్రలను తిప్పికొడుతూ వచ్చారు. ప్రజలు నిర్వహించిన సమావేశానికి కేవత్ కిషన్ సహచరుడు లక్ష్మణ్ ద్విచక్రవాహనంపై వస్తుండగా లారీ ఢీ కొనడంతో ఇద్దరు అక్కడికక్కడే వీర మరణం పొందారు. కేవత్ కిషన్ మరణ వార్త విన్న ప్రజలు కన్నీరు పెడుతూ, కసితో లేస్తూ కేవత్ కిషన్ ఆశయాలను సాధిస్తామంటూ, కేవత్ కిషన్ అమర్ హై అంటూ నినాదాలు జోరందుకున్నాయి. ప్రజల కోసం ప్రాణాలు తృణప్రాయంగాపెట్టిన కేవత్ కిషన్ పార్థీవ దేహాన్ని చూసి ప్రజలు బోరున విలపించారు. ఆశేష జనవాహిని మధ్య అంత్యక్రియలు జరిగాయి. ఆయన లేకున్నా ఆయన చూపించిన పోరు జరుగుతూనే ఉంది. తరతరాలుగా పీడిత, తాడిత ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. ప్రజలు మాత్రం మరచిపోని నేతగా ప్రజల హృదయాల్లో నిలిచిపోయాడు. కేవత్ కిషన్‌కు స్మారకంగా ఏకంగా పొలంపల్టి ప్రజలు ప్రతి సంవత్సరం డిసెంబర్ మాసంలో జరుపుకుంటారు. మెతుక జిల్లా జాతర, పోరాటాల యాతర – పోదాం పద పొలంపల్లి పోరాటాల జాతర.
– దామరపల్లి నర్సింహారెడ్డి