ప్రజాశక్తి ముందు ఏ శక్తి నిలువదు

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై ఢిల్లీలో వాడీవేడీగా చర్చలు జరగుతుండగానే హైదరాబాద్‌లో వ్యాపార సామ్రా జ్యాలు ఏర్పాటు చేసుకున్న సీమాంధ్ర పెట్టుబడిదారులు అడ్డుకు నేందుకు ఉన్న అన్నిదా రులనూ ఉపయోగిం చుకుం టున్నారు. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు తమతో అంటకాగుతున్న ఓ పార్టీ ముఖ్య నేతను ఇందుకు ఉపయో గించుకున్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలను మరో పార్టీ ఉపయో గించుకుని తన రాజకీయ ప్రాబల్యాన్ని పెంచుకు నేందుకు ప్రయత్నించింది. వీరందరి పరమా వధి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడమే. కానీ ఇందుకోసం ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి, వారు కొట్టుకు చచ్చేలా చేయాలని ప్రయత్నించడం దారుణం. తమ వ్యాపార, రాజకీయ ప్రయోజనాల కోసం అమా యకుల ప్రాణాలు బలిగొనాలని కుయుక్తులు పన్నడం ప్రజాస్వామ్య విలువలనే ఖననం చేయడంతో సమానం. పాలకులు సేవలు, ప్రజలు ప్రభువులు.. రాజ్యాంగం చెప్పే నిజమిది. కానీ ఈ నిజానికి సమాధి కట్టేందుకు స్వార్థ రాజకీయ శక్తులు పన్నని కుట్రలు, కుతంత్రాలు లేవు. పాలకులు ప్రభువులుగా మారి, ప్రజలను సేవలకులు మార్చి రాజకీయ చదరంగం ఆడుతున్నారు. తమ స్వార్థం కోసం ఎంతకైనా దిగజారుతున్నారు. ఇలాంటి ప్రయత్నమే 1991లోనూ జరిగింది. అధికారం కోసం సీమాంధ్ర రాజకీయ శక్తులు హైదరాబాద్‌లో కృత్రిమ మత కలహాలు సృష్టించాయి. వేర్వేరు వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలు ఇందుకు మరింత ఆజ్యం పోశాయి. దీంతో మొదట్లో కొంత మానవనష్టం సంభవించింది. కానీ హైదరాబాదీలు త్వరగానే కుట్రలను పసిగట్టారు. స్వార్థశక్తులు ఎంతగా పేట్రేగి పోయినా, ఎన్ని ప్రేలాపణలు చేసినా హైదరాబాదీ ప్రజలు ఎంతో సంయమనంతో వ్యవహరించారు. గంగాజమున తహజీబ్‌ మాది అని చాటి చెప్పారు. నేతల కుయుక్తులు సఫలీకృతం కాకుండా ప్రతి హైదరాబాదీ వందశాతం చిత్తశుద్ధితో పాటు పడ్డాడు. కవ్వింపు చర్యలకు పాల్పడినా, రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసినా తామంతా అన్నాదమ్ముళం అని
చాటిచెప్పారు. మొదట రెచ్చిపోయిన నాయకుడిని చట్ట ప్రకారం అరెస్టు చేసి తీసుకుపోతున్నప్పుడు హైదరాబాద్‌లో అరాచక శక్తులు పేట్రేగాలని చూశాయి. అయినా ప్రజలు తమ పనులు చేసుకుంటూ పోయారే తప్ప, వారి వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఇప్పుడు మళ్లీ అదే అరాచక శక్తులన్నీ ఏకమై తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకు ఏకమయ్యాయి. ప్రజల మధ్య విద్వేశాలు రగల్చడమే ఏకైక ఎజెండాగా కుట్రలు పన్నారు. ప్రజలు రోడ్లమీదికొచ్చి కొట్టుకు చస్తుంటే తెలంగాణ అంశం పక్కకు పోతుందనేది వారి అతి విశ్వాసం. ఇదే లక్ష్యంతో ఎంఐఎం శాసనసభ పక్షనేత అక్బరుద్దీన్‌ ఓవైసీ విద్వేశాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు. దీనిని మరో మతతత్వ పార్టీ బీజేపీ సొమ్ము చేసుకోవాలని ప్రయత్నించింది. పాతబస్తీలో ఉద్రిక్త పరిస్థితులు రెచ్చగొట్టేందుకు ఎంఐఎం శాయశక్తులా ప్రయత్నించింది. కానీ ప్రజలు తమ పనుల్లో తాము నిమగ్నమయ్యారు. అక్బర్‌ అరెస్టు సందర్భంగా ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళనలకు దిగినా ప్రజలు దైనందన జీవితాల్లోనే మునిగిపోయారు. తమ మధ్య ఉన్నది సోదరభావమేనని, ఎప్పటికీ కలిసే ఉంటామని చాటి చెప్పారు. హైదరాబాద్‌లోని ప్రజల జీవనంపై ప్రపంచ దేశాలు దృష్టిసారిస్తున్నాయి. ప్రజల మధ్య సఖ్యతపై అధ్యయనం చేస్తున్నాయి. ఏవైనా రెండు వేర్వేరు జాతులు ఒకే చోట వైరుధ్య భావాలతో నివసిస్తున్నప్పుడు ఎప్పుడూ ఉద్రిక్త వాతావరణమే నెలకొంటుంది. తరచూ దాడులు, ప్రతిదాడులు జరుగుతుంటాయి. ఈక్రమంలో బలమైన వర్గం చేతిలో బలహీనులు ప్రాణాలు కోల్పోతారు. కాలక్రమంలో బలహీనమైన జాతి అంతరిస్తుంది. కానీ హైదరాబాదీ సంస్కృతి, జీవన విధానం ఇలాంటి విపరీత పరిస్థితులు ఇంతకుముందెప్పుడూ లేవు. ఇకముందు కూడా ఉండబోవు. నిజాం కాలం నుంచి కలిసిమెలిసి జీవనం సాగిస్తున్న హైదరాబాదీల మధ్యల ఎవరు చిచ్చుపెట్టాలని చూసినా ఫలితం ఉండదు. తాజా రాజకీయ పరిణామాలు ఈ విషయాన్ని మరోసారి ధ్రువీకరించాయి. ప్రజల చిత్తశుద్ధి ముందు ఏ శక్తి, ఎవరి కుయుక్తులు నిలువబోవని తేల్చిచెప్పారు.