ప్రజా ప్రతినిధులు, అధికారులతో సమన్వయం చేసుకుంటూ మండల అభివృద్ధికి పాటుపడాలి

– ఎంపీపీ సత్యహరిశ్చంద్ర, జెడ్పీటీసీ రాందాస్ నాయక్
కుల్కచర్ల, అక్టోబర్ 21 (జనం సాక్షి):
కుల్కచర్ల ఎంపీడీఓ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మండల పరిషత్ 12వ సర్వసభ్య సమావేశం సాదాసీదగా సాగింది.ఇట్టి సమావేశానికి ఎంపీపీ సత్యహరిశ్చంద్ర అధ్యక్షతన నిర్వహించారు.ముందుగా వివిధ శాఖల అధికారులు వారి పనితీరుపై చర్చించారు. అనంతరం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై వాటిని పరిష్కరించేలా సమావేశాలు ఉండాలి కానీ ఇలా నామమాత్రంగా సమావేశాలు నిర్వహించడం ఎందుకని ప్రజా ప్రతినిధులు మండిపడ్డారు.ఈ సందర్భంగా ఎంపీపీ సత్యహరిశ్చంద్ర, జెడ్పీటీసీ రాందాస్ నాయక్ మాట్లాడుతూ..ప్రజా ప్రతినిధులు అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ మండల అభివృద్ధికి పాటుపడాలని కోరారు.ప్రతి తండాకు మిషన్ భగీరథ వాటర్ సరఫరా చేయాలని సంబంధిత మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు.ప్రతిసారి సర్వసభ్య సమావేశానికి విద్యుత్ ట్రాన్స్కో ఏఈకి తీర్మానం ఇవ్వగలరని ఎంపీడీవోను కోరారు.కొన్ని శాఖల అధికారులు డుమ్మ కొట్టడంతో ప్రజా ప్రతినిధులు తీవ్ర అసహనం వ్యక్తం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ బృంగి హరికృష్ణ, రైతుబంధు మండల అధ్యక్షులు రాజు, వైస్ ఎంపీపీ రాజశేఖర్ గౌడ్, ఎంపీడీవో నాగవేణి, ఎంపీఓ కరీం, ఎమ్మార్వో రమేష్ కుమార్, పంచాయతీరాజ్ డీఈ ఉమేష్ కుమార్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Attachments area