ప్రజా సమస్యలపై పోరు కొనసాగుతుంది

3

– కోదండరాం

హైదరాబాద్‌,మార్చి18(జనంసాక్షి): ప్రజల సమస్యలపై గళమత్తాలని జెఎసి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌.కోదండరాం సూచించారు. తెలంగాణ రకోసం పోరాడిన జెఎసి అనంతరం ప్రజా సమస్యలపైనా పోరాడుఉతందని అన్నారు. తెలంగాణ ఏర్పాటు వల్ల ఈ ప్రాంత సమస్యలు తొలగిపోతాయని ఆనాడు పోరాడామని, ఇప్పుడు కూడా  ప్రజాసమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకుపోతామని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం తెలంగాణ జేఏసీ కోర్‌ కమిటీ సమావేశం  జరిగింది. అమరుల ఆశయసాధన కోసం తాము కృషి చేస్తామని కోదండరాం ప్రకటించారు.  తెలంగాణ వచ్చాక మరింత భాద్యతగా పనిచేయాలని, కాని ఉద్యోగ సంఘాలు ఏ ఇబ్బంది వల్ల జేఏసీ నుంచి బయటకు వెళ్లారో తనకు తెలియదన్నారు.  జేఏసీగా తమకు ప్రజల పట్ల ప్రేమ ఉంది తప్పా ఎవరిపై శతృత్వం లేదన్నారు. ప్రజల తరపున సంఘాలు క్రీయాశీలకంగా ఉండాలని… ప్రజలు పాలనలో భాగస్వామ్యం కావాలని ఆయన కోరారు. సెక్షన్‌ 8 పై ఏపీ సర్కారు తీర్మానం చేయడం హాస్యాస్పదమని ఆయన విమర్శించారు. తమ జేఏసీలో ఇంకా ఎన్ని సంఘాలు ఉన్నాయో స్టీరింగ్‌ కమిటీ సమావేశం తర్వాతే తేలుతుందని చెప్పారు. వచ్చే వారం జేఏసీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి, ప్రజా సమస్యలపై చర్చించనున్నట్లు తెలిపారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ ఆలోచనలతో విద్యావంతులు, ప్రజల సమస్యలపై గళమెత్తాలని.. ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తామన్నారు. ఎన్నికలొక్కటే ప్రజాస్వామ్యం కాదు.. ఎన్నికల అనంతరం కూడా ప్రజల తరఫున క్రియాశీలకంగా వ్యవహరించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. వివిధ అంశాలపై చర్చించి వాటిని పరిష్కరించుకునే దిశగా ముందుకు సాగుతామని అన్నారు. గౌరీశంకర్‌ తదితరులు సమావేశంలో మాట్లాడారు.