ప్రతినిధి మెదక్ యాదగిరిగుట్ట లోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని ఎమ్మెల్సీ, కెసిఆర్ రాజకీయ కార్యదర్శి శేరి సుభాష్ రెడ్డి దర్శించుకున్నారు.
జనం సాక్షి ప్రతినిధి మెదక్ యాదగిరిగుట్ట లోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని ఎమ్మెల్సీ, కెసిఆర్ రాజకీయ కార్యదర్శి శేరి సుభాష్ రెడ్డి దర్శించుకున్నారు. స్వయంభువులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.స్వామివారి దర్శనానికి వెళ్లిన శేరి సుభాష్ రెడ్డికి వేదపండితులు మంత్రోచ్ఛారణల మధ్య పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పూజల అనంతరం ఆలయ అర్చకులు వేదాశీర్వచనం గావించారు.ఆలయ ఉప కార్యనిర్వహణాధికారి భాస్కర శర్మ తీర్థప్రసాదాలు అందజేశారు.ఈ సందర్భంగా సుభాష్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో అత్యంత వైభవోపేతంగా ఉండేవిధంగా స్వామివారి గుడి నిర్మాణం చేపట్టిన ఘనత ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ కి దక్కిందన్నారు. ఆలయ నిర్మాణంలో ఎక్కడా రాజీపడకుండా ఎన్నేళ్లు గడిచినా, ఎన్ని లక్షల మంది భక్తులు స్వామిని దర్శించుకోవడానికి వచ్చినా ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఎమ్మెల్సీ శేరి సుభాష్ తో పాటు మెదక్ జిల్లా హవేళిఘనపూర్ మండల ఎంపీపీ శేరి నారాయణ రెడ్డి , చిన్నం రెడ్డి, గోవిందరెడ్డి, నరసింహారెడ్డి, ప్రశాంత్ రెడ్డి, ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్ గౌడ్ పాల్గొన్నారు.