ప్రతి పల్లెకు వైద్యసేవలు

5

– సీఎం కేసీఆర్‌ సమీక్ష

హైదరాబాద్‌,ఏప్రిల్‌ 12(జనంసాక్షి): రాష్ట్రంలోని గ్రామాల్లో, మారుమూల ప్రాంతాల్లో వైద్య సేవలు మెరుగుపర్చాలని అధికారులను ఆదేశించారు. అలాంటి ప్రాంతాలను గుర్తించి అక్కడ పనిచేస్తున్న వైద్యులకు నగదు ప్రోత్సాహమందించే ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులకు సూచించారు. ఇవాళ 104, 108 సేవలపై సీఎం అధికారులు, మంత్రి లక్ష్మారెడ్డి సవిూక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ గ్రావిూణ ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు సవిూప పట్టణంలో ఉండే వెసులుబాటు కల్పించాలని నిర్దేశించారు.డాక్టర్లు ఖచ్చితంగా సమయ పాలన పాటించాలని ఆదేశించారు. హైదరాబాద్‌లో 4 పెద్దాసుపత్రుల నిర్మాణాలకు వెంటనే స్థలాలను గుర్తించాలని సూచించారు. బడ్జెట్‌లో వైద్య,ఆరోగ్య శాఖ పెద్ద మొత్తంలో నిధులను కేటాయించామని..అనేక సంస్కరణలు తెచ్చినందున వాటి ఫలితం పేదలకు అందేలా పనిచేయాలని సూచించారు. ప్రధాన రహదారుల వెంట ప్రమాదాల నివారణకు పోలీసులు, వైద్యశాఖ సంయుక్తంగా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. ప్రధాన రహదారుల వెంట ట్రౌమా సెంటర్లు వెంటనే ఏర్పాటు చేయాలని అధికారులను అదేశించారు.ట్రౌమా సెంటర్లలో కావాల్సిన వైద్య పరికరాలన్నీ అందుబాటులో ఉంచాలని..రహదారుల వెంట పెట్రోలింగ్‌ నిర్వహించే పోలీస్‌ వాహనాల్లో కూడా ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్‌ లుండాలని సూచించారు. ట్రౌమా సెంటర్ల ద్వారా ఆన్‌ లైన్‌ హెల్త్‌ కేర్‌ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. సవిూకలో డీజీపీ అనురాగ్‌ శర్మ, మంత్రి మంత్రి లక్ష్మారెడ్డి, అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రం ఏర్పడే నాటికి లక్షజనాభాకు ఒక 108 చొప్పున 312 వాహనాలుండేవని..ఇపుడు 75 వేల జనాభాకు ఒక 108 ఉండాలని నిర్ణయించినట్టు సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. ఇవి పెంచడంతో పాటు సత్వరంగా సేవలు అందించేలా చేస్తున్నామని అన్నారు. మంగళవారం104, 108 సేవలపై సీఎం కెసిఆర్‌ అధికారులు, మంత్రి లక్ష్మారెడ్డి సవిూక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ తాజాగా తీసుకున్న నిర్ణయంతో 169 అంబులెన్స్‌లు పెరిగాయని తెలిపారు. ఇప్పటికే 145 వాహనాలు అందుబాటులోకి వచ్చినట్టు పేర్కొన్నారు. 108 వాహనాలన్నీ అద్భుత సేవలందించేలా ప్రభుత్వ పరంగా కావాల్సిన సహకారమందిస్తమని సీఎం మరోసారి స్పస్టం చేశారు. 108 ఉద్యోగుల వేతనాలను పెంచాల్సిన అవసరముందన్నారు. ఇటీవల తాను టీన్యూస్‌ లైవ్‌ షోలో పాల్గొన్నపుడు వరంగల్‌కు చెందిన 108 ఉద్యోగి రమేశ్‌ ప్రస్తావించిన అంశాలపై చర్చించినట్టు తెలిపారు. వేతనాల పెంపుపై అధికారులతో మాట్లాడి సానుకూల నిర్ణయం తీసుకోవాలని మంత్రి లక్ష్మారెడ్డికి ఆదేశాలు జారీచేసినట్టు వెల్లడించారు. రహదారుల వెంట అన్ని సౌకర్యాలతో ట్రామా సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. కొత్తగా నిర్మించనున్న నాలుగు ఆస్పత్రుల కోసం వెంటనే స్థలాలను గుర్తించాలని కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేశారు.  గ్రామాల్లో పనిచేసే వైద్యుల నగదు ప్రోత్సాహానికి ప్రతిపాదనలు తయారు చేయాలని ఆదేశించారు. పోలీస్‌ పెట్రోలింగ్‌ వాహనాల్లో ప్రాథమిక చికిత్స కిట్‌ ఉండాలి, ప్రధాన రహదారుల వెంట ట్రామా సెంటర్లు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. 108కు ప్రభుత్వ పరంగా సహకారం అందిస్తామని స్పష్టం చేశారు. 108 ఉద్యోగుల వేతనాలు పెంచాల్సిన అవసరముంది, వేతనాల పెంపుపై అధికారులతో మాట్లాడి నిర్ణయించాలని మంత్రి లక్ష్మారెడ్డిని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు పోలీసులు, వైద్యశాఖ కలిసి పనిచేయాలని సూచించారు.