ప్రతి పేద కుటుంబానికి పెద్ద కొడుకుగా సీఎం కేసీఆర్
గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమెహన్ రెడ్డి
మల్దకల్ సెప్టెంబర్ 22(జనంసాక్షి)గద్వాల నియోజకవర్గంలో మల్డకల్ కేంద్రంలోని కొత్త ఆసరా పెన్షన్లర్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమెహన్ రెడ్డి,జెడ్పీ చైర్మన్ సరిత,రాష్ట్ర వినియోగదారుల ఫోరం చైర్మన్ గట్టు తిమ్మప్ప హాజరయ్యారు.కెసిఆర్ చిత్రపటానికి ఎమ్మెల్యే ప్రజాప్రతినిధులు,నాయకులు, లబ్ధిదారులతో కలిసి పాలాభిషేకం చేశారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 57 సంవత్సరాలు నిండిన వారికి రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా పది లక్షల పింఛన్లను మంజూరు చేయడం జరిగింది.ఎమ్మెల్యే చేతుల మీదుగా మల్డకల్ మండలానికి సంబంధించిన 1224 మంది అర్హులైన లబ్ధిదారులకు నూతన ఆసరా పెన్షన్ కార్డులు అందజేశారు.
అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెలంగాణ ఆడపడుచులకు కోసం బతుకమ్మ సంబరాల సందర్భంగా బతుకమ్మ దసరా పండుగ కానుకగా బతుకమ్మ చీరనుఎమ్మెల్యేమహిళలకు గురువారం అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ
గత టిడిపి హయాంలో రూ50 పింఛన్, కాంగ్రెస్ హయాంలో రూ 200 పింఛన్లు ఉండేవని కానీ తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ గారు 57 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ ఆసరా పెన్షన్లు అందిస్తున్నారని పేర్కొన్నారు.
వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్నామని, సాగు పెట్టుబడి కోసం రైతుబంధు, దురదృష్టవశాత్తు రైతు మరణిస్తే ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం రైతు బీమా ద్వారా అందజేయడం జరుగుతుందన్నారు. ఇలాంటి పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా లేవని,
రైతులకు కోసం అహర్నిశలు శ్రమించి ప్రపంచంలోనే ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని గర్వంగా చెప్పారు.
తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలతో రైతులతో పాటు తెలంగాణ ప్రజలు అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని వివారించారు.
ప్రజా సంక్షేమం, ప్రాంతాభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్ అహర్నిశలు శ్రమిస్తున్నారని ఆయన అన్నారు.వృద్ధులు, వికలాంగులు, వితంతు మహిళలకు నెలవారీగా ప్రభుత్వం ఫించన్లు అందిస్తుందని, ఒంటరి మహిళలకు సైతం ఫించన్లు ఇస్తున్న ఘనత తమ టిఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు అని తెలిపారు సీఎం కేసీఆర్ అంటే నాయకుడిని భవిష్యత్తులో మనమందరం మరొక్కసారి ఆశీర్వదించి కేసీఆర్ గారిని గెలిపించాలని అప్పుడే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ సరోజమ్మ, జిల్లా గ్రంధాలయ ఛైర్మన్ జంబు రామన్ గౌడ,వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ రామేశ్వరమ్మ,ఎంపీపీ రాజారెడ్డి, జెడ్పిటిసి ప్రభాకర్ రెడ్డి, సింగిల్ విండో ఛైర్మన్ తిమ్మారెడ్డి, వైస్ ఎంపీపీ వీరన్న, మండలం రైతు బంధు సమితి అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, మండలం పార్టీ అధ్యక్షుడు వెంకటన్న , మండలం సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వర్ రెడ్డి, సర్పంచ్ యాకోబు,ఆలయ కమిటీ చైర్మన్ ప్రహ్లాద రావు,వ్యవసాయ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ సవారన్న, తెరాస పార్టీ నాయకులు రమేష్ నాయుడు, సీతారాం రెడ్డి ,సత్యారెడ్డి, విక్రమసింహారెడ్డి,తూం కృష్ణారెడ్డి, నరసింహారెడ్డి, చక్రధర్ రెడ్డి,ఆంజనేయులు, నరేందర్ ,మధు,రమేష్ రెడ్డి, నారాయణ,రామచంద్ర రెడ్డి, మహమూద్ అలీ,చంద్రశేఖర్ రెడ్డి, రామకృష్ణ నాయుడు, భాస్కర్ గౌడ్, నాయకులు కార్యకర్తలు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Attachments area