ప్రధాని ప్రశంస అసాధారణం

3

సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌ మార్చి 24 (జనంసాక్షి):

రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం కల్పించిన వాతావరణాన్ని ప్రధాని మోదీ ప్రశంసించారని, రాష్ట్ర విధానాల గురించి ప్రధాని మాట్లాడటం సాధారణమైన విషయం కాదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. గురువారం ఆయన ఐటీ, ఔషధనగరి, టెక్స్‌టైల్‌, బాహ్యవలయ రహదారి నిర్మాణాలపై మంత్రులు, అధికారులతో సవిూక్షించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ.. పెట్టుబడుల కేంద్రంగా హైదరాబాద్‌కు ప్రపంచ వ్యాప్త గుర్తింపు వస్తోందని, అందుకనుగుణంగా ప్రభుత్వ ప్రణాళికలు, కార్యాచరణ ఉండాలని సూచించారు.

ఔషధనగరి ఏర్పాటుపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొందన్నారు. పరిశ్రమలు, ఐటీ కంపెనీలకు ఇస్తున్న ప్రోత్సాహంపై విస్తృత ప్రచారం చేయాలన్నారు. ఐటీ పరిశ్రమల ప్రోత్సాహానికి పూర్తిస్థాయి చర్యలు తీసుకోవాలన్నారు. జీనోమ్‌ వ్యాలీలో రూ. వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని, టీహబ్‌ కూడా మంచి ఫలితాలనిస్తోందని తెలిపారు. వరంగల్‌లో అతిపెద్ద టెక్స్‌టైల్‌ పార్క్‌ వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఈ సందర్భంగా కేసీఆర్‌ పేర్కొన్నారు.