ప్రధాన రహదారిపై చెట్టు పడ్డ పట్టించుకుని ఆర్& బి
టేకులపల్లి ,సెప్టెంబర్ 12( జనం సాక్షి ): ఇల్లందు, కొత్తగూడెం ప్రధాన రహదారిలోని మండల కేంద్రం సమీపాన టేకులపల్లి, ముత్యాలంపాడు మధ్యలో డబుల్ బెడ్ రూమ్ గృహాల దగ్గర్లో రహదారి సగం వరకు తుమ్మ చెట్టు పడి నాలుగు రోజులు అవుతున్న ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నప్పటికీ ఆర్ అండ్ బి శాఖ పట్టించుకోకపోవడం శోచనీయం . అసలు ఆర్ అండ్ బి శాఖ రోడ్డు పొడవున గుంతలు పడ్డ పట్టించుకోరు . కనీసం నాలుగు రోజుల నుండి విస్తృతంగా వర్షాలు పడుతుండటంతో తుమ్మచెట్టు ఒరిగి ప్రధాన రహదారి పై పడినప్పటికీ పట్టించుకోకపోవడం పట్ల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు . ఇంత నిర్లక్ష్యంగా ఆర్ అండ్ బి శాఖ ఉండడం పట్ల ప్రమాదాలకు బాధ్యత ఎవరు వహించాలి. ఇంతటి ఉదాసీనత వ్యవహరిస్తున్న అధికారులపై మండల ప్రజలు వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టి సారించి చెట్టును తొలగించే ప్రయత్నాలు చేయాలని కోరుతున్నారు .