ప్రాజెక్టుల్లో భారీ కుంభకోణం

4
– టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌

హైదరాబాద్‌,మార్చి13(జనంసాక్షి): నీటి పారుదల ప్రాజెక్టుల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు వేల కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి

ఆరోపించారు. అసెంబ్లీ ప్రాంగణంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ… ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు అంచనాలను రూ.40 వేల కోట్లకు పైగా పెంచారన్నారు.  అసెంబ్లీ స్పీకర్‌ మధుసూదనాచారి తీరు అభ్యంతరకరంగా ఉందని..సభను నిష్పక్షపాతంగా నడపడం లేదని ఉత్తమ్‌ విమర్శించారు.తెలంగాణ ప్రయోజనాలను కేసీఆర్‌ మహారాష్ట్రకు తాకట్టు పెట్టారని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, చిన్నారెడ్డి, డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణహిత-చేవెళ్ల రీ డిజైన్‌తో రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నమైందన్నారు. కేసీఆర్‌

నియంతలా వ్యవహరిస్తున్నారని…ప్రజలు కొట్టే పరిస్థితి వస్తుందని ఎమ్మెల్యేలు తెలిపారు.బీజేపీ శాసనపక్షనేత లక్ష్మణ్‌, టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ…అసెంబ్లీ

టీఆర్‌ఎస్‌ పార్టీ విూటింగ్‌లా ఉందన్నారు. సభను వాయిదా వేసి అధికారపార్టీ పారిపోయిందని ఆరోపించారు.