ప్రాణహితకు జాతీయహోదా కల్పించండి
– ఉమాభారతికి సీఎం కేసీఆర్ వినతి
– తెలంగాణ సమస్యలు పరిష్కరించండి
– ప్రధానితో ఎంపీ కవిత
న్యూఢిల్లీ,మే8(జనంసాక్షి):
ప్రాణహిత చేవెళ్లకు జాతీయ¬దా కల్పించాలని సిఎం కెసిఆర్ కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఉన్నతస్థాయి బృందంతో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతిని కలిసి వివిధ అంశాలపై చర్చించారు. సిఎంస్ రాజీవ్ శర్మ, ప్రత్యేకాధికారి స్మితా సబర్వాల్, నీటిపారుదలశాఖ నిపుణులు విద్యాసాగర్ రావు, ఎంపి కవితలు సిఎం వెంట ఉన్నారు. అనంతరం పోలవరం వంటి ప్రాజెక్టు తెలంగాణకూ ఇస్తారని భావిస్తున్నానని నిజామాబాద్ ఎంపీ కవిత అన్నారు. కేంద్రమంత్రి ఉమాభారతితో కేసీఆర్ భేటీ ముగిసిన అనంతరం ఆమె మాట్లాడుతూ కృష్ణా ట్రైబ్యునల్ అంశంపై ఉమాభారతితో సీఎం చర్చించారని, మే 16లోగా ఉమాభారతి రాష్ట్రానికి వస్తారని తెలిపారు. ప్రాణహితకు జాతీయోదా కోరామన్నారు. వరంగల్‌లో పైలాన్ ఆవిష్కరణకు రావాల్సిందిగా ఆహ్వానించామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రమంత్రి ఉమాభారతిని కలిసి మిషన్ కాకతీయ, కృష్ణా ట్రిబ్యునల్ అంశాలపై చర్చించారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ ¬దా కల్పించాలని కేసీఆర్ ఉమాభారతిని కోరినట్లు తెలిపారు. వరంగల్‌లో మిషన్ కాకతీయ స్థూప ఆవిష్కరణకు ఉమాభారతిని ఆహ్వానించారని చెప్పారు. కృష్ణా వాటర్ ట్రిబ్యునల్‌లో తెలంగాణ రాష్ట్రాన్ని చేర్చే విషయంపై చర్చించినట్లు కవిత వెల్లడించారు. నిజామాబాద్ టీఆర్‌ఎస్ ఎంపీ కవిత శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని పార్లమెంట్ హాల్లో కలిశారు. తెలంగాణకు చెందిన వివిధ అంశాలపై ఆమె ఈ సందర్భంగా ప్రధానితో చర్చించారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరారు. ప్రధానితో చర్చించిన అంశాలపై ఆమె ప్రకటన చేసారు. తెలంగాణ రాష్ట్ర అంశాలను మోడీకి ఎంపీ కవిత వివరించారు. పలు అంశాలపై ప్రధాని మోడీకి ఎంపీ కవిత వినతిపత్రం ఇచ్చారు. అనంతరం కవిత మాట్లాడుతూ… హైకోర్టును విభజించాలని మోడీని కోరామని చెప్పారు. తెలంగాణ అకాల వర్షం కారణంగా 50వేల హెక్టార్లలో పంటనష్టం, 32వేల హెక్టార్లలో తోటల నష్టం జరిగిందని పీఎంకు వివరించామని తెలిపారు. నివేదిక తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి పంపిందని త్వరతగతిన నష్టపరిహారం చెల్లించాలని కోరినం. బకాయి ఉన్న రూ.2వేల కోట్లను 13వ ఫైనాన్స్ కమిషన్‌లో విడుదల చేయాలని కోరామన్నారు. నిజామాబాద్‌లో పసుపు బోర్డు, ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిపారు. జాగృతి సంస్థకు పీఎంకేవీవై పథకంలో భాగంగా స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాలు ఇవ్వాలని కోరామన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాన్ని జాగృతి సంస్థకు ఇవ్వడం ద్వారా టెన్త్, ఇంటర్‌తో చదువు ఆపేసిన
నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించవచ్చన్నారు. పెద్దపల్లి, నిజామాబాద్ రైల్వే పనుల వేగం పెంచాల్సి ఉందన్నారు. డిచ్‌పల్లిలో కొత్త రైల్వేలైను ఏర్పాటు చేయాలని కోరినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ప్రధానితో కవిత సెల్ఫీ తీసుకున్నారు.
రాహుల్‌ది రాజకీయ పర్యటన
రాజకీయ అస్థిత్వం కోసమే రాహుల్‌గాంధీ తెలంగాణలో పర్యటిస్తున్నారని టీఆర్‌ఎస్ ఎంపీ కవిత పేర్కొన్నారు. రైతుల ఆత్మహత్యలు చేసుకోకుండా ఏమైనా ఉంటే రాహుల్ పర్యటనలో చెప్పాలని సూచించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఫోటోలకు ఫోజులిచ్చే ప్రభుత్వం కాదని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందన్నారు. కాంగ్రెస్ హయాంలో ఎందరు మరణించారో వారికి ఏం చేశారో చెప్పాలన్నారు. కేవలం కాంగ్రెస్ నేతలు రాజకీయం చేయడానికి ఈ ఏర్పాట్లు చేశారన్నారు.
హైదరాబాద్ చేరుకున్న సిఎం కెసిఆర్
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఢిల్లీ పర్యటన ముగించుకుని సాయంత్రం హైదరాబాద్ చేసుకున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. కేంద్ర ¬ంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, రక్షణ శాఖ మంత్రి మనోహర్‌పారికర్‌ను సీఎం కలిశారు. సచివాలయం కోసం బైసన్ గ్రౌండ్ ఇవ్వాలని రక్షణ మంత్రిని సీఎం కోరారు. తెలంగాణ పోలీస్ డిపార్ట్‌మెంట్ మోడ్రనైజేషన్‌కు నిధులివ్వాలని రాజ్‌నాథ్‌కు సీఎం విజ్ఞప్తి చేశారు. ఉదయం కేంద్ర మంత్రి ఉమాభారతిని సీఎం కలిశారు. ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ ¬దా, పలు ప్రాజెక్టులపై ఉమాభారతితో సీఎం చర్చించారు. సీఎం బుధవారం రాత్రి ఢిల్లీ వెళ్లిన విషయం విదితమే. ఆయన వెంట అధికారులు, ఎంపిలు కూడా ఢిల్లీ పర్యటనలో ఉన్నారు.