ప్లాస్టిక్ నిషేధ ఉద్యమం రావాలి
పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగిస్తున్న ప్లాస్టిక్ వాడకాలపై యుద్దం ప్రకటించాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రజలను ఓ వైపు చైతన్యం చేస్తూనే మరోవైపు వినయోగంపై కఠినంగా వ్యవహరించాల్సి ఉంది. ప్లాస్టిక్ ఏ రూంపంలో ఉన్నా వాడకుండా చేయడంతో పాటు, ఉత్పత్తి దగ్గరనే దానిని ఆపాల్సి ఉంది. ఉత్పత్తి ద్వారా ఉపాధి కోల్పోతున్న రంగాన్ని ముందుగా అప్రమత్తం చేయాలి. వారికి ప్రత్యమ్నాయ ఉపాధి మార్గం చూపాలి. ప్లాస్టిక్ ఉత్పత్తుల బదులు జనపనార,బట్ట, కాగితపు సంచులు ఉత్పత్తి చేసేలా మార్పులకు శ్రీకారం చుట్టాలి. ¬టళ్లలో ఆకులు మాత్రమే వాడేలా చేయాలి. ఒకవైపు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తేనే ఉపాధి కోల్పోతున్న వారిని ఆదుకునేలా ప్రత్యామ్నాయ విధానాలు అవలంబిస్తే తప్ప ప్లాస్టిక్ నిషేధం ఆగదు. ఇందులో పెద్దపెద్ద తలకాయలు ఇమిడి ఉంటాయి కనుక సహజంగానే ప్లాస్టిక్ ఉత్పత్తుల నిషేధానికి పారిశ్రామికవేత్తలు ముందుకు రారు. వేలకోట్లు పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు చేస్తున్న వారు త్వరగా ఇందుకు సమ్మతించక పోవచ్చు. అందుకే కఠిన చట్టాలను తీసుకుని రావడంతో పాటు ప్రచారా ఉద్యమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలి. స్వచ్ఛభారత్ అమలు చేస్తున్నా గ్రామాల్లో ప్లాస్టిక్ వినియోగంపై నిషేధం అమలు కాకపోవడంతో తీవ్ర కాలుష్యం ఏర్పడుతోంది. ప్రజల్లో ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలపై ఇంకా పూర్తి అవగాహన రావడం లేదు. అది మనలను వెన్నాడుఉతన్న మృత్యువని గుర్తించడం లేదు. దీంతో ప్రజలు పని సులువుగా ఉంటుందని ప్లాస్టిక్ కవర్లను వాడుతున్నారు. చివరకు ఆరుబయట ¬టళ్ల నుంచి టీని ప్లాస్టిక్ కవర్లలో పోయించుకుని వాడుతున్నారు. ప్లాస్టిక్ కవర్లు లేదా కాగితాల్లో వేడి పదార్థాలను వాడడం వల్ల కలిగే దుష్పరిణామాలను ముందుగా ప్రచారం చేసి అవగాహన పెంచాలి. ఇకపోతే ప్రజలు ఇష్టం వచ్చినట్లుగా ఉపయోగించిన ప్లాస్టిక్ వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ జార విడుస్తున్నారు. దీంతో భూమిలో అది చేరి వాతావరణ కాలుష్యాన్ని పెంచుతోంది. కేన్సర్ లాంటి వ్యాధుల వ్యాప్తికి, వాతావరణం కాలుష్యానికి కారణమౌతున్న ప్లాస్టిక్‌పై ప్రభుత్వం నిషేధం విధించింది. బహిరంగ ప్రదేశాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలని వదలడంతో పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుందన్న విషయాన్ని గుర్తించేలా చేయాలి. ఆస్పత్రులు, ¬టల్స్, ఆటోమొబైల్స్, పరిశ్రమల్లో వినియోగించిన ప్లాస్టిక్ వ్యర్థాలను సరైన క్రమంలో వినియోగించకపోవడంతో పర్యావరణానికి హాని కలుగుతుంది. ఈ వ్యర్థాలను రీసైక్లింగ్ ద్వారా సమాజానికి ఉపయోగపడే విధంగా మలుచుకోవచ్చు. భూసారాన్ని దెబ్బతీస్తున్న పాలిథిన్ వినియోగాన్ని తగ్గించాలని కోరుతున్నా అధికారులు క్షేత్రస్థాయిలో వాటి వినియోగాన్ని నియంత్రించలేకపోతున్నారు. ఇందుకు ఉద్యమ తరహా మార్పు అవసరమని పర్యావరణ వేత్తలు అభిప్రాయపడుతున్నారు. గ్రామాల పరిధిలో ప్లాస్టిక్ వినియోగం రోజురోజుకూ పెరిగిపోతోంది. దీనికితోడు చెత్త శుద్ధి లోపించడంతో ప్రధాన రహదారుల్లో దుర్వాసన వెదజల్లుతోంది. పెళ్లిళ్లు, పండుగలు, పార్టీల్లో విచ్చలవిడిగా ప్లాస్టిక్ గ్లాసులు, కవర్లను వినియోగిస్తున్నారు. వినియోగం అనంతరం రహదారులు, ఖాళీ ప్రదేశాల్లో గుట్టలుగా పడేసి చేతులు దులుపుకుంటున్నారు. వాతావరణాన్ని కలుషితం చేసి మన ప్రాణాలను హరిస్తున్నాయన్న విషయం గుర్తించేకపోతున్నాం. గుట్టలు గుట్టలుగా పడివున్న ప్లాస్టిక్ వ్యర్థాలను ఆహారంగా భావించి తింటున్న పశువులు, జంతువులు మృత్యువాత పడుతున్నాయి. ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులు, సీసాలను తరచూ వినియోగిస్తూ కేన్సర్ వ్యాధి సోకే లక్షణాలు అధికంగా ఉన్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చిన్న పిల్లలకు కూడా సోకే అవకాశం అధిక శాతం ఉందని సూచిస్తున్నారు. వినియోగం విపరీతంగా పెరిగి పోవడంతో కాలువలు, డ్రెయిన్లు, ఖాళీ ప్రదేశాలు, డంపింగ్‌యార్డుల్లో గుట్టలు గుట్టలుగా ప్లాస్టిక్ కవర్లు
పేరుకుపోతున్నాయి. డిస్పోజల్ వస్తువుల అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. దీంతో పలువురు వ్యాపారస్తులు టన్నుల కొద్ది నిల్వ చేసి అమ్మకాలు సాగిస్తున్నారు. పలువురు వ్యాపారులు షాపుల ముందు, ఆరుబయట గుట్టలుగా పేర్చి విక్రయాలు నిర్వహిస్తున్నారు. ¬టళ్లలో కూడా ప్లేట్లలో అరటి, ఇతర ఆకులకు బదులుగా ప్లాస్టిక్ కవర్లు వినియోగిస్తున్నారు. ఆహార పదార్ధాలు ప్యాకింగ్‌కు సైతం వీటిని వాడుతున్నారు. పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగిస్తున్న ప్లాస్టిక్ వస్తువుల నిషేధంపై జిల్లా కలెక్టర్
తహశీల్దార్లకు పూర్తి అధికారాలు ఇచ్చారు. అమ్మినా, కొనుగోలు చేసినా, వినియోగించినా, ఎక్కడబడితే అక్కడ వేసినా రూ.ఐదు వేల నుంచి రూ.25 వేల వరకూ జరిమానా విధిస్తారు. విక్రయ షాపులపై దాడులు చేసి వస్తువులను స్వాధీనం చేసుకోవడం, షాపులను సీజ్ చేయడం వారిపై కేసులు నమోదు చేసే అధికారం తహశీల్దార్లకు ఉంది. ముడుపులకు లొంగి చూసీ చూడనట్లు వ్యవహరించడం పరిపాటిగా మారిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. మార్కెట్లో పేపర్ గ్లాసులు, పేపర్ కవర్లు, ప్లేట్లు దర్శనమిస్తున్నా వివాహాది శుభకార్యాల్లో కూడా ఎ/-లాస్టిక్ వాడకం ఎక్కువగా ఉంటుంది. దీనిపై మరలా అధికారులు విస్తృత ప్రచారం చేయాలని ప్రజలు కోరుతున్నారు.ప్లాస్టిక్ నిషేధ ఆజ్ఞలు అమల్లో ఉన్నా అమలు కావడం లేదు. అధికారుల ఉదాశీనత, వినియోగదారుల అవగాహనలేమితో విచ్చలవిడిగా వినియోగం కొనసాగుతూనే ఉంది. దీంతో టన్నుల కొద్దీ ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. ఎక్కడ చూసినా కాలువలు, డ్రెయిన్లు వీటితో నిండిపోతున్నాయి. హరిత ఉద్యమం లాగే ప్లాస్టిక్ వ్యతిరేక ఉద్యమంగా సాగితే తప్ప నిషేధం అమలు జరగదని అంటున్నారు.
కేవలం మైకాన్ల లెక్కల్లో ప్లాస్టిక్ వాడకాన్ని చూడకుండా మొత్తంగానే నిషేధం విధించి కఠినంగా అమలుకు పూపుకోవాలి. లేకుంటే విపరీత వ్యాధులను కొని తె/-చుకోవడం తప్ప మరోటి కాదు. ఈ దిశగా ప్రచార ఉద్యమం సాగాలి. నిరంతరంగా దీనిని కొనసాగించి విజయం సాధించాలి.