ఫలక్‌ సయిదాను అభినందించిన సీఎం కేసీఆర్‌

3

హైదరాబాద్‌,మే4(జనంసాక్షి): క్యాంపు కార్యాలయంలో  ముఖ్యమంత్రి  కేసీఆర్‌ను అథ్లెట్‌ ఫలక్‌ సయీదా కలిసింది. 2016 యూఎస్‌ ఓపెన్‌ అథ్లెట్‌ ఛాంపియన్‌ షిప్‌లో ఫలక్‌ సయీదా భారత్‌ తరపున పాల్గొంది. కరాటే ఛాంపియన్‌ 68 కేజీల పోటీల్లో ఫలక్‌ సయీదా ప్రథమస్థానంలో నిలిచింది. గతంలో 15 అంతర్జాతీయ, 20 జాతీయ అవార్డులను గెలుచుకుంది. పోలీస్‌శాఖ షీటీమ్స్‌లో పనిచేయాలని ఉందని తన ఆంకాంక్షను సీఎం కేసీఆర్‌కు తెలిపింది. దీనికి సీఎం కేసీఆర్‌ సానుకూలంగా స్పందించారు. జూన్‌2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఫలక్‌ సయీదాకు సీఎం కేసీఆర్‌ ప్రత్యేక అవార్డు ఇవ్వనున్నారు. ఆమెను ఈ సందర్భంగా సిఎం అభినందించారు.