ఫామ్‌లో లేని కోహ్లీని కొనసాగించడం తగదు

మాజీ క్రికెటర్‌ కపిల్‌ దేవ్‌ ఘాటు వ్యాఖ్య
న్యూఢల్లీి,జూలై9 ( జనంసాక్షి): ఫామ్‌లో ఉన్న వాళ్లను పక్కన పెట్టి, ఫామ్‌లో లేని వాళ్లను జట్టులో కొనసాగించడం తగదని మాజీ క్రికెటర్‌ కపిల్‌దేవ్‌ అన్నాడు. టెస్ట్‌ల్లో 450 వికెట్లు పడగొట్టిన బౌలర్‌ అశ్విన్‌ లాంటి అతడిని టెస్ట్‌ల్లో తుది జట్టునుంచి తప్పించినప్పుడు సుదీర్ఘకాలంగా విఫలమవుతున్న విరాట్‌ను టీ20లలో కొనసాగించడమా’ అని టీమిండియా మాజీ కెప్టెన్‌ కపిల్‌దేవ్‌ తీవ్రంగా ప్రశ్నించాడు. ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లకు తగిన అవకాశాలు ఇవ్వకపోతే వారికి జట్టు యాజమాన్యం అన్యాయం చేస్తున్నట్టేనని అభిప్రాయపడ్డాడు. ’టీ20లలో కోహ్లీని బెంచ్‌కు పరిమితం చేయాల్సిన సమయం ఇది. వరల్డ్‌ నెం.2 బౌలర్‌ను టెస్ట్‌ జట్టునుంచి తప్పించినప్పుడు..ఒకప్పుడు నెం.1 బ్యాటర్‌గా ఉన్న ఆటగాడిని కూడా పక్కకుపెట్టాలి’ అని ఓ చానెల్‌తో మాట్లాడుతూ కపిల్‌ సూచించాడు. తన గత వైభవంతో విరాట్‌ జట్టులో కొనసాగుతున్నాడని అతడు వ్యాఖ్యానించాడు.

తాజావార్తలు