బంగారు తెలంగాణకు కళాకారులదే సారథ్యం

C
గమ్యం ముద్దాడేవరకు నిలబడిన్రు

తెలంగాణ చరిత్రకు చిహ్నంగా కళాభారతి

హైదరాబాద్‌,ఏప్రిల్‌ 19(జనంసాక్షి) : అంతా కలలు కంటున్న బంగారు తెలంగాణ సాధనలో కలాకారులు కీలకపాత్ర పోషించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. తెలంగాణ సాంస్కృతిక సారధి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పాల్గొన్న ఆయన ఉద్వేగంగా మాట్లాడారు. కళాకారులు లేకుంటే తెలంగాణ వచ్చి ఉండేది కాదన్నారు. అసలు తెలంగాణ ప్రజల్లో దాగి ఉన్న శక్తిని బయటికి తీసుకొచ్చి రాష్ట్ర సాధనకు భాగస్వాముల్ని చేయించిన శక్తి కలాకారులదే అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుపకెళ్లే కళాాకారులకు ప్రభుత్వ ం అన్ని రకాల వసతులు, సౌకర్యాలు కల్పిస్తుందన్నారు. కళాకారులకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం కేవలం చిరు సత్కారమేనన్నారు. ఉద్యమ సమయంలో ఇతర పార్టీల సిట్టింగ్‌ ఎమ్మెల్యేల నుంచి బెదిరింపులు వచ్చినా భయపడకుండా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లిన ఘనత కలాకారులదేనని కేసీఆర్‌ అన్నారు. ఉద్యమ సమయంలో ఎండనకా, వాననకా కళాకారులు ఉద్యమాన్ని జనాల్లోకి తీసుకెళ్లారన్నారు. ఉద్యమ సమయంలో కనీసం తినటానికి తిండి దొరకని పరిస్థితుల్లోనూ.. ఆకలితో మాడుతున్నా పాటను మాత్రం ఆపలేదని కేసీఆర్‌ కళాకారులను కొనియాడారు. ప్రబుత్వ కార్యక్రమాల ప్రచారంలో కేవలం కళాకారులదే కీలక పాత్ర అని, దీనికోసం ఎక్కడ్నుంచో డైరెక్టర్లు ఊడిపడాల్సిన అవసరం లేదని, పక్కా తెలంగాణ యాసలో జనానికి అర్థమయ్యే రీతిలో ప్రచారం నిర్వహించడం తెలంగాణ కళాకారులకు బాగా తెలుసని కేసీఆర్‌ అన్నారు.

రాష్ట్ర చరిత్ర, వారసత్వ, నిర్మాణ కౌశలానికి చిహ్నంగా కళాభారతి నిర్మాణం ఉంటుందని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్నారు. కళాభారతి భవన నమూనాకు ఆయన ఆదివారం ఆమోదముద్ర వేశారు. ఇందిరాపార్క్‌ సమీపంలోని 14 ఎకరాల్లో ఈ నిర్మాణం చేపట్టనున్నారు. ఈ నిర్మాణానికి త్వరలో ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. దీనిలో అంతర్జాతీయ ప్రమాణాలతో నాలుగు సమావేశమందిరాలు ఉంటాయి. వీటితోపాటు సినిమాహాళ్లు, గ్రంథాలయాలు, గ్యాలరీ, అతిథి గృహాలు, రెస్టారెంట్లు ఉంటాయి. సంగీత నాటక అకాడమీ కార్యకలాపాలకు ప్రత్యేక నిర్మాణాలు ఉంటాయి.

కళాభారతి నమూనాకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆమోదం తెలిపారు. ప్రభుత్వం ఇందిరాపార్కు సవిూపంలో 14 ఎకరాల్లో కళాభారతి నిర్మాణాన్ని చేపట్టనుంది. కళాభారతి నిర్మాణానికి సీఎం కేసీఆర్‌ త్వరలోనే శంకుస్థాపన చేయనున్నారు. కళాభారతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన 4 సమావేశ మందిరాలు నిర్మించనున్నారు. అంతేకాకుండా సినిమా హాళ్లు, గ్రంథాలయం, గ్యాలరీ, అతిధి గృహాలు, రెస్టారెంట్లు ఏర్పాటు చేయనున్నారు. లలిత కళా అకాడవిూ, సంగీత నాటక అకాడవిూ కార్యకలాపాల నిర్వహణకు ప్రత్యేక నిర్మాణాలు చేపట్టనున్నారు. తెలంగాణ సాంస్కృతిక వికాసానికి, చరిత్ర, వారసత్వ నిర్మాణ కౌశలానికి గుర్తుగా కళాభారతి నిర్మాణం చేపట్టనున్నారు.