బంగారు తెలంగాణలో టీఎస్‌పీఎస్సీ భాగస్వామ్యం కావాలి

3

లోగో ఆవిష్కరించిన గవర్నర్‌

రెండేళ్లలో లక్ష ఉద్యోగాలు

మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌,ఏప్రిల్‌11(జనంసాక్షి):

రాష్ట్రంలోని నిరుద్యోగులకు నోటిఫికేషన్లు ఇచ్చేందుకు రంగం సిద్దమైంది.  బంగారు తెలంగాణలో టీఎస్‌పీఎస్సీ భాగస్వామ్యం కావాలని  గవర్నర్‌ నరసింహన్‌ అన్నారు. ఈ మేరకు ఇవాళ రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో టీఎస్‌పీఎస్సీ లోగోను, వెట్‌సైట్‌ను గవర్నర్‌ నరసింహన్‌ ఆవిష్కరించారు. తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌  టీఎస్‌పీఎస్సీ లోగోను, వెబ్‌సైట్‌ను గవర్నర్‌ నరసింహన్‌ ఆవిష్కరించారు. శనివారం రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ రెండేళ్లల్లో లక్ష ఉద్యో గాల బర్తీకి సర్కారు సిద్ధంగా ఉందన్నారు. పీఎస్‌పీఎస్‌సీ ఛైర్మన్‌ ఘంటా చక్రపాణి, కమిషన్‌ సభ్యులు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఘంటా చక్రపాణి మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షను లోగో, వెబ్‌ సైట్‌ ప్రతిఫలిస్తుందని తెలిపారు. మూడు నెలల క్రితం గవర్నర్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడం జరిగిందని, వివిధ పోటీల ఎగ్జామ్స్‌, స్కీమ్స్‌ తదితర అంశాలపై ప్రభుత్వానికి పంపించడం జరిగిందన్నారు. టీఎస్‌పీఎస్సీ లోగోను ప్రముఖ చిత్రకారుడు యేలే లక్ష్మన్‌ రూపొందించారు. ఈ సందర్భంగా టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ… కమిషన్‌ వెబ్‌సైట్‌ను యూపీఎస్సీతోపాటు దేశంలోని పలు రాష్టాల్ర వెబ్‌సైట్లను పరిశీలించాకే రూపొందించామని చెప్పారు. టీఎస్‌పీఎస్సీ కార్యాచరణకు వెబ్‌సైట్‌ అద్దం పడుతుందని తెలిపారు. కేరళ రాష్ట్రంలో అన్ని రంగాల ఉద్యోగాలను కమిషనే భర్తీ చేస్తుందని పేర్కొన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాల సమాచారం అందించేందుకు వన్‌టైమ్‌ రిజిస్టేష్రన్‌ సిస్టంను ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ విధానం ద్వారా నిరుద్యోగులు ఒకసారి రిజిస్టేష్రన్‌ చేసుకుంటే ఉద్యోగాల సమాచారాన్ని వారికి ఎప్పటికప్పుడు ఎస్‌ఎంఎస్‌ రూపంలో చేరవేస్తామని వివరించారు.