బంగారు తెలంగాణే లక్ష్యం

C

– తెలంగాణ సాధించా!.. నా జన్మ ధన్యమైంది

– ఇంటింటికీ మంచి నీరు

– ఇవ్వకపోతే ఓట్లడగా

– యువతకు లక్ష ఉద్యోగాలు

– 14వ వార్షికోత్సవంలో తెరాస అధ్యక్షుడు కేసీఆర్‌

హైదరాబాద్‌,ఏప్రిల్‌27

(జనంసాక్షి):

ప్రతి మనిషి ముఖంలో చిరునవ్వు తాండవించినప్పుడే తెలంగాణ కల సాకారమైనట్లని, ఇప్పుడు తన అక్ష్యం అదేనని టిఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసి ఆర్‌ అన్నారు. వచ్‌ఇచన తెలంగాణను ఈనగాచి నక్కల పాలు చేయకుండా లక్ష్యసాధన కోసం కృషి చేస్తున్నానని అన్నారు. తాను గతంలో చెప్పినట్లుగా తెలంగాన తెచ్చానని, ఇప్పుడు బంగారు తెలంగాణ చేసి చూపుతానన్నారు అంటే పది తులాల బంగారం కాద న్నారు. సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో జరిగిన టిఆర్‌ఎస్‌ 14వ వార్షికోత్సవ వేదికనుంచి కెసిఆర్‌ మాట్లాడారు. నాటి మన స్వప్నం తెలంగాణ రాష్ట్రం, నేటీ మన స్వప్నం బంగారు తెలంగాణ రాష్ట్ర సాధన అని సీఎం స్పష్టం చేశారు.  బడుగు, బలహీన వర్గాల కళ్లలో సంతోషం వచ్చినపుడే బంగారు తెలంగాణ సాధ్యమన్నారు. ఇప్పుడు మనకు కావాల్సింది మాటలు కాదు, చేతలని సూచించారు. ప్రతీ తెలంగాణ బిడ్డ ముఖం బంగారు నాణెంలా వెలిగినపుడే బంగారు తెలంగాణ అవుతుందని పేర్కొన్నారు. నాడు తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు మాటతప్పితే రాళ్లతో కొట్టమని అన్నానని, ఇవాళ ఇంటింటికీ మంచినీరు ఇవ్వకుంటే ఓట్లు అడగనని చెబుతున్నానని అన్నారు. ఇది వజ్రసంకల్పానికి నిదర్శనమన్నారు. 29 రాష్టాల్ల్రో ఎవరు కూడా ఇలాంటి ప్రకటన చేసి ఉండరన్నారు. అందరూ ఎన్న్నికల ముందు పథకాలు, హావిూలు ఇస్తారని, తాను మాత్రం అందుకు భిన్నంగా ఛాలెంజ్‌ చేస్తున్నానని అన్నారు. సంక్షేమ పతకాల అమలులో తనతో బహిరంగ చర్చకు రావలని విపక్షాలకు సవాల్‌ చేశారు. ఎక్కడా  అమలు చేయని విధంగా వివిధ పథకాలకు ఏటా 28వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని అన్నారు. దీనిపై విమర్శలు చేస్తున్నవారు ఎక్కడైనా చర్చకు రావాలన్నారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో తనను ఆశీర్వదించి, తనతో కలసి నడవడం వల్లనే తెలంగాణ

సాధ్యమయ్యిందన్నారు. ఎన్నో అవమానాలు ఎదురొడ్డి రాష్టాన్న్రి సాధించుకున్నామన్నారు. రాజ్యాంగబద్దంగా పోరాడి తెలంగాణ తెచ్చుకున్నామని అన్నారు. ఈ దశలో తెలంగాణ కోసం అమరులైన వారి కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని ప్రకటించారు. అమరవీరుల కుంటుంబాలను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామని తెలిపారు. ఉమ్మడిరాష్ట్రంలో మనకు బాష రాదని సంసృతి తెలియదని హేళన చేసారని గుర్తు చేశారు. అలాగే ఇప్పుడు అనేక కార్యక్రమాలు కూడా ముందుకు తీసుకుని పోతున్నామని అన్నారు. సకల జనుల సమ్మె యావత్‌ తెలంగాణ సమాజాన్ని ఏకం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ సమాజం ఏదో ఒకనాడు ఏకమైతదని తాను ఏనాడో చెప్పానని తాను చెప్పినట్టే ప్రజలంతా ఏకమై ఉద్యమం చేశారని వివరించారు. తెలంగాణ రాష్టాన్న్రి సాధించుకున్న ఘనత ప్రజలకే దక్కుతుందన్నారు. యువత బలిదానాలు, తాను చేపట్టిన దీక్ష తెలంగాణ రాష్ట్రం వచ్చేలా చేశాయని  కేసీఆర్‌ అన్నారు.  తాను తెలంగాణ కోసం దీక్ష చేస్తే.. యువత బలిదానాలతో పోరాడారని అన్నారు. ఆటుపోట్లను తట్టుకుంటే తెలంగాణ వస్తుందని ఆనాడే చెప్పానని గుర్తుచేశారు. కేసీఆర్‌ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అని దీక్ష చేశానని చెప్పారు. తెలంగాణ తెచ్చుకున్న ఘనత తెరాస కార్యకర్తలదేనని  కేసీఆర్‌ అన్నారు. తాను ఇప్పుడు బంగారు తెలంగాణ కోసం పోరాడుతున్నానని చెప్పారు.రాష్ట్రంలో నిరుపేదలు సంతోషంగా ఉన్ననాడే బంగారు తెలంగాణ వచ్చినట్లని పేర్కొన్నారు. తనది, తన జట్టు లక్ష్యం బంగారు తెలంగాణ సాధనేనని ప్రకటించారు. రాష్ట్రంలో ప్లలెప్లలెకు మంచినీళ్లు ఇవ్వకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగమని  కేసీఆర్‌ అన్నారు.  ప్రజా సంక్షేమరంగంలో దేశంలో ఏ రాష్ట్రం చేయని పనులు చేస్తున్నామని తెలిపారు. వచ్చే ఏడాది మార్చి తర్వాత ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు రైతులకు నిరంతర విద్యుత్‌ ఇస్తామని వెల్లడించారు. ఈ ఏడాది నుంచే పేదలకు రెండు గదుల ఇళ్లు నిర్మించి ఇస్తామని ప్రకటించారు. వంద శాతం ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని హావిూ ఇచ్చారు. అలాగే నిరుఎద్యోగులకు రానున్న రెండేళ్లలో లక్ష ఉద్యోగాలు ఇస్తామన్నారు. కమలనాథన్‌ కమిటీ విభజన కారణంగా కొంత కిరికిరి ఉందన్నారు. ఎవరు కూడా నిరాశ చెందవద్దన్నారు. మోసపు మాటలు నమ్మవద్దన్నారు. కెజి టూ పిజి తన చిరకాల వాంచ, తన స్వప్నమన్నారు. కడియం శ్రీహరి దీనిపై కసరత్తు చేస్తున్నారని, వచ్చేయేడు దీనిని ప్రారంభిస్తామని అన్నారు. చెరువులను బాగు చేసుకుంటేనే పల్లెల్లో అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు సీఎం కేసీఆర్‌. టీఆర్‌ఎస్‌ బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ.. మిషన్‌ కాకతీయ పనుల విషయంలో నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు చాకులా పని చేస్తున్నారని కొనియాడారు. హరీష్‌రావు సారథ్యంలో చెరువుల పునరుద్ధరణను విజయంవంతం చేయాలన్నారు. నీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తాం. చెరువులలో పూడిక తీసే మట్టి.. మట్టి కాదు.. సమైక్య పాలకులు చేసిన పాపమే పేరుకుపోయిన మట్టి అని ధ్వజమెత్తారు. హరీష్‌రావు బ్రహ్మాండంగా పని చేస్తున్నారని చెప్పారు.

టిడిపి అధినేత చంద్రబాబుపై విమర్శలు

ఏపీ సీఎం చంద్రబాబుపై ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్‌ నిప్పులు చెరిగారు. చంద్రబాబు తనను నిద్ర పోనియ్యడంట. మొన్న మహబూబ్‌నగర్‌ సభలో ఏదేదో మాట్లాడిండు. మన సభకు వచ్చినంత జనం కూడా రాలేదు. ఇక్కడ బఠాణీలు అమ్ముకునేంత మంది కూడా అక్కడ రాలేదు. . బాబు వెంబడి పెంపుడు కుక్కలు ఉన్నాయి. అవి మొరుగుతున్నాయి. ఒకాయన తనతో ఇలా అన్నాడు. గాడిదలు గట్లనే అరుస్తాయన్నారు.  గాడిదలు ఉంటేనే గుర్రాల విలువ తెలుస్తది అని సీఎం చెప్పారు. దీంతో సభలో ఒక్కసారిగా చప్పట్లు మార్మోగాయి.పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు అక్కడ రాజ్యముంది, ప్రజలున్నారని ఇక్కడ ఏముందో అర్థం కావడంలేదని అన్నారు. పొమ్మంటే పోడు తెల్లారి లేస్తే ఏదో కిరికిరిపెడుతూ కూర్చుంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ ఆయన ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చ లేక, చేతగాక ఇక్కడకొచ్చి తనపై విమర్శలు చేస్తున్నాడని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు అన్ని అబద్దాలే చెబుతున్నాడని దుయ్యబట్టారు. అక్కడ డ్వాక్రా మహిళలకు రుణమాపీ చేస్తానని చెప్పి మభ్యపెట్టాడని, కేవలం విూడియా కవరేజీతో కాలం వెల్లబుచ్చుతున్నాడని విమర్శించారు. అక్కడ దిక్కులేదు గానీ ఇక్కడ మహబూబ్‌నగర్‌కు వచ్చి తనను విమర్శిస్తున్నాడని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున నేపాల్‌ ప్రజానీకానికి సీఎం కేసీఆర్‌ ప్రగాఢ సానుభూతి తెలిపారు. టీఆర్‌ఎస్‌ బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ.. నేపాల్‌కు తెలంగాణ ప్రభుత్వం తరపున అవసరమైన సాయం అందిస్తామని స్పష్టం చేశారు. నేపాల్‌లో ఉన్న తెలంగాణవాసులను రాష్టాన్రికి సురక్షితంగా తీసుకొచ్చేందుకు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఇప్పటికే పలువురు రాష్టాన్రికి చేరుకున్నారని చెప్పారు.

మైనార్టీలూ మద్దతు తెలపండి

అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం మహముద్‌ అలీ స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ పాలనలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నదని తెలిపారు. కేసీఆర్‌ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల ప్రభుత్వమని ఉద్ఘాటించారు. కళ్యాణలక్ష్మీ పథకం దేశంలో ఎక్కడా లేదన్నారు. గత ప్రభుత్వాలు ముస్లింలను ఓటు బ్యాంకుగానే చూశాయన్నారు. ఇక మిగులు విద్యుత్‌ సాధించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు తెలిపారు. వేసవిలోనూ కరెంట్‌ కోతలు లేకుండా చేసిన ఘనత సీఎం కేసీఆర్‌ది అని చెప్పారు. ప్రతి ఇంటికి మంచి నీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఉద్ఘాటించారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకెళ్తుందని స్పష్టం చేశారు.