బడ్జెట్‌ స్టడీ చేసి సూచనలివ్వండి..

2

సభ్యులకు సీఎం కేసీఆర్‌ సూచన

హైదరాబాద్‌,మార్చి11(జనంసాక్షి): బ్జడెట్‌పై సభ్యులంతా అధ్యయనం చేసి సూచనలు ఇవ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ శాసనసభ్యులను కోరారు. శాసనసభలో తొలి బ్జడెట్‌ ప్రవేశపెట్టిన తీరు సంతృప్తికరంగా ఉందన్న ఆయన బ్జడెట్‌ రూపకల్పన చేసిన ఆర్థికమంత్రి, అధికారులను అభినందించారు. హావిూల అమలు చిత్తశుద్ధి బ్జడెట్‌ కేటాయింపుల్లో కనిపిస్తోందని, శాఖలకు నిధుల కేటాయింపుల్లో సమతుల్యత పాటించారని కేసీఆర్‌ పేర్కొన్నారు.  బడ్జెట్‌పై సీఎం స్పందిస్తూ.. హావిూలను అమలు చేయడానికి వీలు కల్పించేలా బడ్జెట్‌ కేటాయింపులు ఉన్నాయి. బడ్జెట్‌లో ప్రజల దీర్ఘకాలిక  అవసరాలైన మంచినీటి పథకం, చెరువుల పునరుద్ధరణ, రోడ్ల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. బడ్జెట్‌ కేటాయింపులకు అనుగుణంగా మంత్రులు, అధికారులు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలందరికి చేర్చాలి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బడ్జెట్‌పై పూర్తిస్థాయి అధ్యయనం చేసి ప్రభుత్వానికి సూచనలు, సలహాలు అందించాలని ఆయన పేర్కొన్నారు.  త్వరలో 2వేల మెగావాట్ల సోలార్‌ విద్యుదుత్పత్తికి ఏర్పాట్లు చేస్తున్నట్లు కేసీఆర్‌ తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన సీఐఐ సదస్సులో సీఎం కేసీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. పరిశ్రమలకు రాష్ట్రంలో సమృద్ధిగా భూములు అందుబాటులో ఉన్నాయని, పరిశ్రమల ఏర్పాటుకు రాయితీల కోసం కేంద్రంతో మాట్లాడుతున్నామని వెల్లడించారు. శంషాబాద్‌కు సవిూపంలోనే భూములు అందుబాటులో ఉన్నాయన్నారు. రాచకొండ గుట్టల్లో 35వేల ఎకరాలు అందుబాటులో ఉన్నాయని, ఎలక్టాన్రిక్‌ హార్డ్‌వేర్‌, చిత్రనగిరికి ఈ భూములు కేటాయిస్తామని చెప్పారు. రంగారెడ్డి జిల్లా కందుకూరులో ఫార్మాసిటీ కోసం భూమి సేకరిస్తున్నామని తెలిపారు. గ్రేటర్‌ చుట్టుపక్కల జిల్లాల్లో లక్షన్నర ఎకరాల భూములు ఉన్నాయని వివరించారు. అంచనాలు లేని జలవిద్యుత్‌ కంటే థర్మల్‌ విద్యుత్‌పైనే ఎక్కువగా ఆధారపడతామని వివరంచారు. దక్షిణ, ఉత్తర విద్యుత్‌ గ్రిడ్‌లు ఇంకా అనుసంధానం కాలేదు. పూర్తయితే 24 గంటలూ నాణ్యమైన విద్యుత్‌ అందిస్తామని స్పష్టం చేశారు. ఈ ఏడాది దాదాపు విద్యుత్‌ కోతలు లేకుండానే కొనసాగుతున్నామన్నారు. అతి త్వరలోనే తెలంగాణలో విద్యుత్‌ కోత అన్నది తెలియని స్థితికి తీసుకువస్తామని సీఎం వెల్లడించారు.