బలమైన రాజకీయ శక్తిగా కాంగ్రెస్ ను మారుస్తాం
మండల యువజన అధ్యక్షుడుగా శ్రీనివాస్
శివ్వంపేట అక్టోబర్ 12 జనంసాక్షి : మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా మండల పరిధిలోని అల్లిపూర్ గ్రామానికి చెందిన మన్నే శ్రీనివాస్ నియమితులయ్యరు. జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం ఈ ఎంపిక జరిగింది. ఆ తర్వాత శ్రీనివాస్ కు నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి తనను కాంగ్రెస్ పార్టీ మండల యువజన విభాగం అధ్యక్షునిగా నియమించిన మహేందర్ రెడ్డి కీ, తన నియమకానికి కృషి చేసిన కాంగ్రెస్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొడకంచి సుదర్శన్ గౌడ్ లకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నర్సాపూర్ నియోజకవర్గంలో యువజన కాంగ్రెస్ ను బలోపేతం చేయడానికి తను చిత్తశుద్ధితో కృషి చేస్తానన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ని అధికారంలోకి తీసుకురావా డానికి, కాంగ్రెస్ పార్టీని బలమైన రాజకీయ శక్తిగా మారుస్తామని చెప్పారు. పార్టీ పటిష్టత కోసం నిర్విరామంగా పనిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రేమ కుమార్, నర్సాపూర్ నియోజకవర్గ అధ్యక్షులు రియజ్ అలీ, ఉపాధ్యక్షులు సందీప్, ప్రధాన కార్యదర్శి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Attachments area