బహుభాషా కోవిదుడు, రాజకీయవేత్త పీవీ నర్సింహారావు

– నేడు పీవీ నర్సింహారావు జయంతి
భారతదేశ ప్రధానిగా పని చేసిన తొలి దక్షిణ భారతీయుడు, తెలుగు వాడైన పాములపర్తి వెంకట నిరసింహారవు 1921 జూన్‌ 28న జన్మించాడు. వంగర వీరి స్వగ్రామము. పవిగా ప్రతి ఒక్కరికి సుపరి చితులైన బహుభాషావేత్త, రచయిత, అపరచాణక్కుడు ఆర్థిక వ్యవస ్థలో విప్లవవాత్మక మార్పులుఎ తెచ్చిన ఆర్ధిక సంస్కరణల పితామ బహుడు దేశ ప్రగతిలో కీలక మార్పులకై ప్రస్తుత ప్రధాని మన్మోహ న్‌సింగ్‌న ఆర్థిక మంత్రిగా తీసుకు వచ్చిన ఘనత పివి గారిదే. పట్టణ భూ గరిష్ట పరిమతి చట&ం, పంజాబ్‌లో తీవ్రవాదాన్ని అణ చివేసిన ఘనత, ఆగ్నేయాసియా దేశాలతో సంబంధాలు పెంచు కోవడం, ఇజ్రాయిల్‌తో దౌత్యసంబంధాలు, తీవ్రవాదానికి సాకిస్తాన్‌ ఇస్తున్న ప్రోత్సాహాన్ని ప్రపంచ దేశాల్లో చర్చకు పెట్టడం పివి సాధిం చిన ఘనవిజయాలు. నిజం పరిపాలన సమయంలో ప్రభుత్వాన్ని ధిక్కరిస్తూ కకాలేజీలో ‘వందేమాతరం’ గీతాలాపన చేసిన ధీశాలి. స్వామి రామానంద తీర్థ, బూర్గుల రామక్రిష్ణారావు అనుచరునిగా స్వాతంత్య్ర పోరాటంలోనూ, హైదరాబాద్‌య విముక్తి పోరాటం లోనూ పాల్గొన్నాడు.
1957లో మంథని నియోజక వర్గం నుండి తొలిసారిగా వాసన సభకు ఎంపికైన నాటినుండి ఇంక వెను తిరిగి చూడలేదు పివి న్యాయ సమాచార శాఖ మంత్రి, దేశాదాయ శాఖ మంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి, కేంద్ర రక్షణ శాఖ మంత్రి, కేంద్ర మానవ వనరుల అభివృద్ది శాఖ మాత్యు లుగా విభిన్న పదవులను సమర్ధవంతంగా నిర్వహించారు. భారత ప్రణాళికా శాఖా మంత్రి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులుగా పదవు లను నిర్వహించారు. 1971-1973 మధ్య ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సేవలందించారు. 1991-1996 వరకు పదవీ కాలం పూర్తయ్యే వరకు 5 సంవత్సరాలు భారతదేశ ప్రధాన మంత్రి భాద్యతలను నిర్వర్తించారు. అజాత శత్రువుగా, తనకంటూ ఒక వర్గం లేని వాడిగా, వివాదస్పద రహితుడిగా అందరికీ ఆమోదయో గ్యుడిగా ఉండటమే ప్రధానమత్రి పదవికి అర్హున్ని చేసింది.
సాహితీ మూర్తి : పివి రాజకీయంలో తలమునకలవుతున్నా తనకు ప్రియమైన సాహి త్యాన్ని వీడలేదు. విశ్వనాధ సత్యనారాణ రాసిన ‘వేయిపడగలు’ పుస్త కాన్ని ‘సహస్ర ఫణ్‌’ పేరిట హిందీలో అనువాదం చేశాడు. ఇందుకు కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు పొందాడు. ఇన్‌సైడర్‌ ఆయన రచనలలో ప్రఖ్యాతి చెందిన రచన ఇది ‘లోపలి మనిషి’ గా తెలుగు లోకి అనువదించబడింది. ప్రముఖ రచయిత్రి ‘జయప్రభ’ కవితలను ఆంగ్లంలోకి అనువదించాడు. మరెన్నో వ్యాసాలు కలం పేరుతో రాసాడు.
ప్రత్యేకతలు : బహుభాషా పండితుడు తెలుగుతో సహా 17 భాషలు ధారాళంగా మాట్లాడగలిగిన ప్రతిభ ఆయనది. చాలా నిరాడం బరుడు. తన సంతానాన్ని ప్రధాన మంత్రి కార్యాలయానికి దూరం గా ఉంచిన నిజయితీపరుడు. నిండుకుండలాంటి తొణకని వ్యక్తి త్వం, కష్టాలను చిరునవ్వుతో స్వాగతించే స్థైర్యం ఆయనది.
ఆరోపణలు, విమర్శలు : జార్ఖండ్‌ ముక్తి మొర్చా అవినీతి కేసు, సెయింట్‌ కిట్స్‌ ఫోర్టరీకేసు, అఘబాయి పాఠక్‌ కేసులు పవిపై వచ్చినా చివరికి న్యాయస్థానాలు పివిని నిర్థోషిగా ప్రకటించాయి. పదవి నుండి వైదొలగిన తర్వాత కూడా పై కేసులకు సంబంధించి విచారణలను ధీటుగా ఎదుర్కొని మచ్చలేని చంద్రునిలా వెలుగొందాడు. అయినా అయోద్యలో బాబరీ మసీదు సంఘటన ఆయన జీవితంలో నీలినీడలా మిగిలిపోయింది. ముదిమి వయసులో కూడా కంప్యూటర్‌ నేర్చుకుని వాడడం విశేషం.
– వైరాగ్యం ప్రభాకర్‌
జి.ప.ఉ.పాఠశాల చామనపల్లి, కరీంనగర్‌
9014559059