బాధిత కుటుంబాలను ఆదుకోవాలి

తొర్రూరు:23 అక్టోబర్( జనంసాక్షి )
ఆపదలో ఉన్న బాధిత కుటుంబాలను ఆదుకోవడం సామాజిక కర్తవ్యం అని బాలాజీ సోషల్ సర్వీస్ సొసైటీ వ్యవస్థాపకులు నరుకుటి సంతోష్ అన్నారు.
పేద బేడ బుడగ సామాజిక వర్గానికి చెందిన తూర్పాటి శివ అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం డివిజన్ కేంద్రంలో మృతి చెందారు.  అంత్యక్రియలకు సైతం స్తోమత లేని వారి కుటుంబ పరిస్థితిని తెలుసుకున్న బాలాజీ సోషల్ సర్వీస్ సొసైటీ ప్రతినిధులు అంత్యక్రియల నిమిత్తం రూ.10 వేల ను బాధిత కుటుంబానికి అందజేశారు. తూర్పాటి శివ పార్తివదేహానికి సంస్థ తరఫున ఘన నివాళి అర్పించి
బాధిత కుటుంబీకులకు సంస్థ ప్రతినిధి భూతం నరసింహ సదరు మొత్తం అందజేశారు.
ఈ సందర్భంగా సంతోష్ మాట్లాడుతూ.
వలస జీవనం గడిపే బేడ బుడగ జంగాల ప్రజలు ఆయా ప్రాంతాలు తిరుగుతూ అనారోగ్యాల పాలవుతున్నారని తెలిపారు.  కుటుంబ పోషణ నిమిత్తం ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా తిరగటం వల్ల ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారని పేర్కొన్నారు.  వారికి దళిత బంధు,  డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు , ఆర్థిక చేయూత అందించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.


Sent from Email.Avn for mobile

Attachments area