బిసిలకు 50% రిజర్వేషన్లను వెంటనే కల్పించాలి:- బీఎస్పి
బీసీల రిజర్వేషన్లు కల్పించాలని బీఎస్పీ రాష్ట్ర ఈసీ మెంబెర్ బోళ్ళ గణేష్ ,జిల్లా కార్యదర్శి పల్నాటి రాములు, ఇబ్రహీంపట్నం అసెంబ్లీ అధ్యక్షుడు గ్యార మల్లేష్ అన్నారు ఈ సందర్భంగా ఇబ్రహీంపట్నం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ బీసీల జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లను 50 శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు. 50 శాతానికి పైగా జనాభాకు 27 శాతం రిజర్వేషన్లు ఎలా సమాంజసం అని అన్నారు. బీసీ రిజర్వేషన్లతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల రిజర్వేషన్లు.. పెరిగిన జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేశారు.90 ఏళ్ల నుంచి ఇప్పటి వరకు బీసీ కులాల గణన ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. 1953లో ఏర్పాటైన కాలేల్కర్ కమిషన్, 1979లో ఏర్పాటైన మండల్ కమిషన్ సిఫార్సులను పూర్తిగా అమలు చేయకుండా కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు బీసీలను అన్యాయం చేస్తున్నాయని విమర్శంచారు.ఎలాంటి జనగణన లేకుండానే ఈడబ్ల్యూఎస్ ద్వారా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించి 103వ రాజ్యాంగ సవరణ చేసినపుడు, బీసీ రిజర్వేషన్ల కోసం ఎందుకు రాజ్యాంగ సవరణ చేయరని నిలదీశారు.ఈ కార్యక్రమంలో మండల మండల కన్వీనర్లు గోరేటి కుమార్ , గడ్డం మల్లయ్య , మచ్చ మహేందర్,
మున్సిపాలటీ కమిటీ అధ్యక్షులు యంజాలా ప్రహ్లద్ , బంగారిగళ్ళ మహేందర్ ,జోగు స్వామి,
సెక్టార్ కమిటీ నాయకులు
చేతళ్ళ ఈశ్వర్, గంగిరెడ్డి సుధాకర్ రెడ్డి , పల్లాటి రాజు, మరియు మహేష్ మహారాజ్ , గడ్డం రమేష్ తదితరులు పాల్గొన్నారు.