బీమా బిల్లుకు రాజ్యసభ ఆమోదం

4

న్యూఢిల్లీ,మార్చి12(జనంసాక్షి): కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బీమా బిల్లుకు రాజ్యసభ ఆమోదం లభించింది. ఇవాళ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బీమా బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లు రాష్ట్రపతి ఆమోదం పొందితే చట్టంగా మారుతుంది. ఈ చట్టం అమల్లోకి వస్తే బీమా రంగంలో ప్రస్థుతమున్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితి శాతం 26 నుంచి 49 శాతానికి  పెరుగుతుంది. బీమా రంగంలో ఎఫ్‌డీఐలను అనుమతిస్తూ ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్సును చట్టంగా మార్చేందుకు ఈ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మొత్తంమీద పలు వివాదాల అనంతరం చివరకు ఈ బిల్లు ఆమోదం పొందడంతో చట్టంగా మారింది. ఇప్పటికే బ్యాంకింగ్‌ రంగంలో 74 శాతం ఎఫ్‌డీఐలను అనుమతించగా, బీమా రంగంలో 49 శాతం ఆనుమతించడంతో దేశంలో బీమా రంగం మరింత ఊపందుకోనుంది.