బీసీలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పించాలి..

బిపి మండల్ ఆశయాలను సాధించాలి…
ఓయూ చేసి చైర్మన్, బి ఆర్ ఎస్ వి రాష్ట్ర ఉపాధ్యక్షులు తోట్ల స్వామి యాదవ్….
భువనగిరి టౌన్( జనం సాక్షి):–
బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని, బిపి మండల్ ఆశయాలను సాధించాలని ఓ యు జె ఏ సీ చైర్మన్ , బి ఆర్ ఎస్ వి రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ తోట్ల స్వామి యాదవ్ అన్నారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో బీసీ రాజకీయ చైతన్య వేదిక ఆధ్వర్యంలో బీపీ మండల జయంతి ఉత్సవ సభ నిర్వహించగా ముఖ్యఅతిథిగా ఆయన హాజరై, మాట్లాడారు. దేశంలో జన గణన చేపట్టి, కుల గణన చేసి బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని కోరారు. బి పి మండల్ బీసీలకు రిజర్వేషన్ కల్పించడం ఆయన ముఖ్యమంత్రి , ఎమ్మెల్యే పదవిని త్యాగం చేశారని ఆయన సేవలను కొనియాడారు. ఎంపీగా ఎన్నికై దేశవ్యాప్తంగా బిపి మండల్ కమిషన్ చైర్మన్ బీసీలపై అధ్యయనం చేసి రిజర్వేషన్ కల్పించాలని రిపోర్ట్ ఇచ్చినట్లు తెలిపారు. బీసీలు సామాజికంగా, ఆర్థికంగా ఎదగాలని కోరారు. ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ బీనవేని రాము యాదవ్ మాట్లాడుతూ సబ్బండ కులాలు రాజ్యాధికార విషయంలో ఒకదానిపైకి రావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. బీసీలు అటు ఉన్నత వర్గంగా కాకుండా, కింది స్థాయి వర్గం కాకుండా మధ్యరకంగా ఉండడంతో రానున్న 20 సంవత్సరాలలో బీసీలు ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. బీసీలు విద్యను అభ్యసించాలని కోరారు. బీసీలు విద్య, ఉద్యోగం, బిజినెస్, రాజకీయం తో పాటు అన్ని రంగాలలో రాణించాలని కోరారు. బీసీ కులాల వారు సమాజానికి కావాల్సిన వస్తువులను ఉత్పత్తి చేస్తున్నారని వారి సేవలను కొనియాడారు. 500 సంవత్సరాల క్రితమే సైన్స్ పరంగా కులవృత్తుల అభివృద్ధి చెందాలన్నారు కానీ అగ్రవర్ణాలు కుట్రలో భాగంగా కుల వృత్తుల సైన్స్ తీసుకురాకుండా చేశారన్నారు. బీసీలు ఆర్థికంగా ఎదిగిన వారు రాజకీయ రంగాల్లో రాణించి, నాయకత్వం వహించాలని కోరారు. బీపి మండల్ విగ్రహాన్ని జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తా అన్నారు. ప్రతి ఒక్కరూ బీపీ మండల్ చరిత్రను తెలుసుకొని, ఆయన అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. బీపీ మండల్ చరిత్రను సిలబస్లో చేర్పించేలా కృషి చేయాలి అన్నారు. ఈ కార్యక్రమంలో సభ అధ్యక్షులు మామిడాల కిరణ్, శ్రీకృష్ణ యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు పుట్టా వీరేష్ యాదవ్, వివిధ సంఘాల నాయకులు మిర్యల శ్రీనివాస్, బేల్లీ చంద్రశేఖర్, గుండెబోయిన సురేష్ యాదవ్, అవిశెట్టి రమేష్ యాదవ్, కొడారి వెంకటేష్,
సింహాద్రి , రమేష్, ఉప్పలయ్య, జిల్లా నుంచి పెద్ద ఎత్తున బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.