బెంగాల్‌లో భారీ పోలింగ్‌

1

84.24 శాతం ఓటింగ్‌ నమోదు

కోల్‌కతా,మే5(జనంసాక్షి):పశ్చిమ బెంగాల్‌ లో చివరి విడత ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. ఇవాళ కూడా భారీగా పోలింగ్‌ నమోదైంది. పెరిగిన కొత్త ఓటర్లతో 84.24 శాతం పోలింగ్‌ రికార్డు అయ్యింది. ఇవి సాయంత్రం ఐదు గంటల వరకు అందిన గణాంకాలు. అప్పటికే క్యూలో ఉన్న ఓటర్లు కూడా ఓటు వేసే అవకాశం ఇచ్చారు. అవి కూడా కలిపితే పోలింగ్‌ శాతం ఇంకా పెరిగే అవకాశం ఉందని ఎన్నికల సంఘం ప్రకటించింది.ఉదయం నుంచే పోలింగ్‌ కేంద్రాలకు క్యూకట్టిన ఓటర్లు గంటల తరబడి క్యూల్లో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తూర్పు మిడ్నాపూర్‌, కూచ్‌ బిహార్‌ జిల్లాల పరిధిలోని 25 శాసనసభ స్థానాలకు పోలింగ్‌ జరిగింది. మొత్తం 170 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం ఆరు దశల్లో బెంగాల్‌ లో పోలింగ్‌ నిర్వహించారు. ఈ నెల 19 న ఫలితాలు ప్రకటించనున్నారు.