బెంగాల్‌లో మమత పార్టీలపై కాదు.. ఈసీపై పోటీ చేస్తుంది

4

– ప్రధాని నరేంద్ర మోదీ

కోల్‌ కతా,ఏప్రిల్‌ 17(జనంసాక్షి): పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమత బెనర్జీ పార్టీలపై కాకుండా ఏకంగా ఈసీపైనే పోటీచేస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు.

నడియాలోని కృష్ణానగర్‌లో జరిగిన బీజేపీ ఎన్నికల ర్యాలీలో మోదీ ప్రసంగించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్‌ లో సిండికేట్‌ వ్యవహారాలు

నడుస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా అందులో భాగమేనని ఆరోపించారు. శారద, నారద స్కాంలు, కోల్‌ కతాలో ఫ్లై ఓవర్‌ కూలిపోవడం సిండికేట్‌ ఫలితమేనని అన్నారు. ఐదేళ్ల నుంచి బెంగాల్‌ జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు మోడీ. బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీపై తీవ్ర విమర్శలు చేసిన మోడీ? ఈసీ నోటీసులతో మమతా బెనర్జీ ఆత్మరక్షణలో పడిందన్నారు. ఎన్నికల కమిషన్‌ స్వతంత్ర సంస్థ అని, ఈసీని దేశం మొత్తం గౌరవిస్తుందన్నారు. తూర్పు రాష్ట్రాలుఅభివృద్ధి చెందనంత వరకూ.. భారత్‌ పూర్తిగా డెవలప్‌ కాదన్నారు ప్రధాని మోడీ.ఆదివారం ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం మమతకు షోకాజ్‌ నోటీసు పంపిన విషయాన్ని సభలో ఆయన ప్రస్తావించారు.కోల్‌కతాలో ఇటీవల నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్‌ కూలిపోవడానికి బెంగాల్‌లో సిండికేట్‌ సంస్కృతే కారణమని మోదీ విమర్శించారు. దేశంలో

తూర్పు ప్రాంతం అభివృద్ధి చెందకుంటే, దేశం అభివృద్ధి సాధించలేదని అన్నారు. కాంగ్రెస్‌, కమ్యూనిస్టు పార్టీల తీరుపైనా మోదీ విరుచుకుపడ్డారు. కేరళలో అధికారం కోసం పోటీపడుతున్న కాంగ్రెస్‌, కమ్యూనిస్టు పార్టీలు.. పశ్చిమ బెంగాల్‌లో అవకాశవాద పొత్తుకు తెరలేపాయని విమర్శించారు.