బెంగాల్‌లో మూడో విడత పోలింగ్
కోల్‌కతా,ఏప్రిల్ 16(జనంసాక్షి):పశ్చిమ్‌బంగా అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా రాష్ట్రంలోని 56 నియోజకవర్గాలకు నేడు మూడో విడత పోలింగ్ జరగనుంది. 383 మంది అభ్యర్థులు రేపు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వీరిలో 33 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. ఆరు ఉత్తర జిల్లాలైన అలిపూర్ద్వార్, జల్‌పాయ్‌గురి, డార్జిలింగ్, ఉత్తర్ దినాజ్‌పూర్, దక్షిణ్ దినాజ్‌పూర్, మాల్దాలతో పాటు దక్షిణ ప్రాంతంలోని బిర్‌భూమ్ ప్రాంతాల్లో పోలింగ్ జరగనుంది.ఇందులో బిర్‌భూమ్‌లో ఎన్నిక అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఉదయం7గంటల నుంచి ప్రారంభమయ్యే పోలింగ్ సాయంత్రం 4గంటల వరకు జరగనుంది. 13,600 పోలింగ్ స్టేషన్లులో 2909 సమస్యాత్మకమైనవి అని ఎన్నికల అధికారి అన్నారు. ప్రమాదకర ప్రాంతాల్లో భద్రతను పెంపుదల చేస్తున్నారు. ప్రశాంతంగా పోలింగ్ జరిగేందుకు అన్ని విధాల ఏర్పాట్లు చేసినట్లు ఎన్నికల కమిషన్ అధికారులు వెల్లడించారు.