బైకును ఢీకొన్న కారు: ముగ్గురు మృతి

కామారెడ్డి,ఏప్రిల్‌22(జ‌నంసాక్షి):  భిక్కనూర్‌ మండలం బస్వాపూర్‌ వద్ద జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. కారు – బైక్‌ ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదానికి గురైన బైక్‌ నంబర్‌ – ఏపీ 23 హెచ్‌ 5398, కారు నంబర్‌ – ఏపీ 25 హెచ్‌ 5252గా గుర్తించారు.