బోనకల్లు బిటీ రోడ్లకు మరమ్మతులు చేయించండి
ఖమ్మం, అక్టోబర్ 30 : ఖమ్మం- బోనకల్లు రోడ్డు పందిళ్లపల్లి వద్ద నుంచి బోనకల్లు వరకు 18కిలో మీటర్ల దూరం తారురోడ్డు గుంటలు పడి అడుగడుగున అధ్వానంగా తయారైంది. గతుకుల రోడ్డులో ప్రయాణించాలంటే వాహనదారుల అవస్థలు వర్ణనాతీతంగా ఉంది. గత్యంతరం లేక ఈ రోడ్డుపై ప్రయాణించిన వాహనాలు మరమ్మతులకు రావడంతో పాటు ప్రయాణించే వారి నడుము నొప్పులతో ఆసుపత్రుల పాలవుతున్నారు. గతంలో రచ్చబండ కార్యక్రమంలో భాగంగా చింతకాని మండలం రామకృష్ణాపురం గ్రామానికి వచ్చిన ముఖ్యమంత్రి రోడ్డు మరమ్మతులకు నిధులు మంజూరు చేస్తామని ఇచ్చిన హామీ అలాగే నిలిచిపోయింది. రచ్చబండ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు ఆర్ అండ్ బి అధికారులు రోడ్డు విస్తర్ణ, మరమ్మతులకు 12కోట్ల రూపాయలతో ముఖ్యమంత్రి పేషికి మధిర నియోజకవర్గ ఎమ్మెల్యే, డిప్యూటీ స్వీకర్ భట్టి విక్రమార్క తమ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు చెబుతున్న ప్రతిపక్షాలు మాత్రం ఆయన చేస్తున్న అభివృద్ధికి బోనకల్లు రహదారే నిదర్శనమని విమర్శిస్తున్నారు. ప్రస్తుతం రోడ్డు విస్తర్ణకు అధికారులు ప్రతిపాదనలు పంపిణ కూడా ముఖ్యమంత్రి, డిన్యూటీ స్పీకర్ విక్రమార్క పట్టించుకోవడం లేదని బహిరంగగానే విమర్శలు వెలువేత్తుతుండగా, ఇప్పటికైనా స్పందించి రోడ్డు మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని ప్రజలు కోరుతున్నారు.