బ్రిటీష్‌ పౌరసత్వంపై విచారణకు సిద్దం

4

– ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌

న్యూదిల్లీ,మార్చి14(జనంసాక్షి):బ్రిటిష్‌ పౌరసత్వం కలిగి ఉన్నారన్న వివాదాన్ని ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అన్నారు. ఓ బ్రిటన్‌ కంపెనీకి చెందిన న్యాయ సంబంధ పత్రాల్లో రాహుల్‌ ఆ దేశ పౌరుడిగా పేర్కొన్న విషయానికి సంబంధించి వివరణ ఇవ్వాలని 11 మంది సభ్యులతో కూడిన పార్లమెంటరీ ఎథిక్స్‌ కమిటీ రాహుల్‌కు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయమై రాహుల్‌ పై విధంగా స్పందించారు. అసలేం జరిగిందంటే… బ్రిటన్‌లో ఓ కంపెనీ ప్రారంభించేందుకు.. సంబంధిత పత్రాల్లో రాహుల్‌ తాను బ్రిటన్‌ భారతీయుడిగా పేర్కొన్నట్టు భాజపా నేత సుబ్రమణ్యస్వామి గత నవంబర్‌లో ఆరోపించారు. ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్లూ తన వద్ద ఉన్నాయని చెప్పారు. ఈ విషయమై లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌కు కేంద్రమంత్రి మహేశ్‌ గిరి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును పార్లమెంటరీ ఎథిక్స్‌ కమిటీకి స్పీకర్‌ పంపించారు. దీనిపై విచారణ చేపట్టిన ఎథిక్స్‌ కమిటీ.. పౌరసత్వ వివాదంపై వెంటనే వివరణ ఇవ్వాలంటూ రాహుల్‌కు నోటీసులు జారీ చేసింది.