భగత్‌సింగ్ నుంచీ వేలాడుతున్న ఉరితాడు
ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకుంటున్న భారతదేశంలో పాలకులు రోజురోజుకూ ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ దేశ విలువలను దిగజారుస్తున్నారంటున్నారు. ఆకుల భూమయ్య
మార్చ్ 23.2013న భగత్‌సింగ్ 82వ వర్థంతి, భగత్‌సింగ్ రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లు సరిగ్గా 82సవత్సరాల క్రితం ఈ రోజే (23.03.1931) ఉరికంభం ఎక్కారు. వీరిని ఆనాడు ప్రజాగ్రహ ానికి గురవుతామని భయంతో రహస్యంగా ఉరి తీశౄరు. 1975లో భూమయ్య, కిష్టాగౌడ్‌లను అలాగే ఉరి తశీరు. చట్టం పట్ల అంతా శ్రద్దాసక్తులు ఉన్నట్లయితే ప్రజాప్రాయాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలి కానీ, ఇలా రహస్యంగా ఉరి తీయడంలో ప్రభుత్వం తన తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. అంతటి ప్రజాభిమానం చూరుగొన్న నాయకులు ఎందుకు ఉరిశిక్షకు గురవుతున్నారో ఆలోచించాలి. అంటే రాజ్యం తప్పు చేస్తున్నదని ఆర్థమవుతోంది. రాజ్యానికి తాను తప్పు చేస్తున్నానని తెలుసు కాబట్టే ప్రజాగ్రహానికి గురవుతానని భయపడుతోంది. చట్టాన్ని బాహాటంగా అమలు చేసే నైతిక ధైర్యం, స్థైర్యం, అర్హత రాజ్యానికి లేవని స్పష్టంగా తెలుస్తోంది.
ఎవరి రాజకీయ ఖైదీలు? సమాజం కోసం ఆలోచించి, సమాజం కోసం బతికి అనితరసా ధ్యమైన త్యాగాలు చేస్తూ, చివరకు సమాజం కోసం, ప్రజల కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధమైన వారు ఖైదీలుగా ఉండడం అనేది సభ్యసమాజం సిగ్గుపడాల్సిన ఆంశం. అందుకే రాజకీయ ఖైదీలను భేషరతుగా విడదల చేయాలని ప్రజాస్వామిక వాదులు కోరుతు న్నారు. అయితే సమస్త ప్రజానీకం కూడాఇందు కోసం మద్దతుగా నినదించాల్సి ఉంది. ఈ సందర్భంగా మార్చి 23నుంచి 29వరకు రాజకీయ ఖైదీల హక్కుల పోరాట వారంగా సభలు నిర్వహంచడం స్పూర్తి కలిగిస్తుంది.
మన రాష్ట్రంలో జగన్మోహన్‌రెడ్డిలాంటి వారు జైళ్లలో ఉన్నప్పటికీ సకల సౌకర్యాలు అనుభవిస్తూ, తమ రాజకీయ పార్టీల కార్యకలా పాలు నడుపుకుంటున్నాడు. లక్షల కోట్ల రూపాయల అక్రమ సంపాదనతో 2జీ స్పెక్టం లాంటి కేసుల్లో ఉన్నవారు ఘరానా ఖైదీలుగా కొనసాగుతున్నారు. అయితే వ్యవస్థ మార్పు కోసం జరిగే పోరాటాల్లో పాల్గొనే వారు ఇది ప్రజాస్వామ్యం పేరు మీద అమలవుతున్న నియంతృత్వం అంటున్నారు. సిసలైన ప్రజాస్వామ్యం కూడా అనేక ఇబ్బందులు పెడు తూ, వాళ్ల కనీస పౌర ప్రజాస్వామిక మానవ హక్కులను హరిస్తున్నారు. జైళ్లు అంటే సంస్కరణ కేంద్రాలుగా ఉండాలి. కాని అవి కాన్సంట్రేటెడ్ క్యాంపులుగా మారుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ ఖైదీలు జరిపిన పోరాటాలు కొన్ని హక్కులు సాధించినప్పటికీ, విప్లవ కార్యాచరణకు కొంత గౌరవ ప్రదమైన స్థానం కల్పించినప్పటికీ చత్తీస్‌ఘడ్, జార్ఖండ్, మహారాష్ట్ర, ఒడిశా, మధ్యప్రదేశ్, బీహార్ జైళ్ల చిత్రహింసల కొలిమిలుగా ఉన్నాయి. జైళ్లలో మగ్గుతూ పోరాటాలు కొనసాగిస్తున్న ఖైదీల పోరాటాలకు మద్దతుగా బయట ప్రజలు, ప్రజాస్వామికవాదులు పెద్ద ఎత్తున ఉద్యమాలునిర్వహించాల్సి ఉంది. వ్యవస్థ మార్పు కోరుతూ, రాజకీయ కారణాలతో జైళ్లలో మగ్గుతున్న ఖైదీలను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేయడం ప్రతి పౌరుని ప్రాథమిక విధిగా ప్రచారం నిర్వహిం చాల్సి ఉంది. ప్రజాస్వామ్య వ్యవస్థకు, ప్రజాస్వామిక భావనలకు శతాబ్దాల చరిత్ర ఉంది.
– వీక్షణం సౌజన్యంతో
తరువాయి భాగం రేపటి సంచికలో..