భగత్ సింగ్ స్ఫూర్తితో నేటి యువత ఉద్యమించాలి
-ఎస్ఎఫ్ఐ జహీరాబాద్ ఏరియా కమిటీ
జహీరాబాద్ సెప్టెంబర్ 27( జనం సాక్షి) భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ జహీరాబాద్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో భగత్ సింగ్ 115వ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది.ఈ సందర్భంగా ఎస్ ఎఫ్ ఐ జహీరాబాద్ ఏరియా కార్యదర్శి రాజేష్ మాట్లాడుతూ భగత్ సింగ్ స్ఫూర్తితో విద్యలోకాశాయికరణ, మతోన్మాదానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామని అన్నారు. ప్రగతిశీల అభ్యుదయ భావాలకు వ్యతిరేకమైనటువంటి పరిపాలన నిర్వహిస్తున్న బిజెపి పాఠ్యాంశాల్లో మతోన్మాదాన్ని మూఢత్వాన్ని పెంచే విధంగా విద్యా విధానాన్ని అవలంబిస్తుందని బిజెపి అధికారంలో ఉన్న కర్ణాటక రాష్ట్రంలో దేశ స్వాతంత్రం కోసం తన ప్రాణాలను లెక్కచేయకుండా ఉరికంభం ముద్దాడిన భగత్ సింగ్ జీవిత విశేషాలను కర్ణాటక ప్రభుత్వం పాఠ్యంశం నుంచి తొలగించి మూఢవిశ్వాసాలు పెంచే విధంగా స్వాతంత్ర పోరాటంలో ఏ రోజు పాలుపంచుకొని “సావర్కర్ అండమాన్ జైలు నుంచి బుల్బుల్ పక్షి రెక్కల పై వచ్చి పోరాటం చేసి మళ్లీ జైలుకు వెళ్ళినట్టుగా పాఠ్యపుస్తకాలలో ఉంచారు, ఇది బిజెపి నీతిమాలిన విద్యా విధానానికి మూఢత్వానికి నిదర్శనమని కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విద్యా విధానాలకు వ్యతిరేకంగా సామ్రాజ్యవాద మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాటంకై యువత సిద్ధం కావాలని అన్నారు. దేశంలో నూతన విద్యా విధానం పేరుతో విద్యార్థులలో విద్యలో కులాన్ని మతాన్ని చొప్పించి ప్రయత్నం చేస్తుంది అన్నారు భవిష్యత్తులో నూతన విద్యా విధానం రద్దు చేసేంతవరకు పోరాటం చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఏరియా ఉపాధ్యక్షులు దుర్గ ప్రసాద్, నాయకులు మల్లేష్,అతిక్,రమేష్,విష్ణువర్ధన్ తదితరులు పాల్గొన్నారు.