భగ్గుమన్న హెచ్‌సీయూ

5

-వీసీ రాకతో ఉత్రిక్తత

హైదరాబాద్‌ ,మార్చి22(జనంసాక్షి):హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ మంగళ వారం మరోమారు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గత కొంత కాలంగా  ప్రశాంతంగా ఉన్న క్యాంపస్‌.. వీసీ అప్పారావు పునరాగమనంతో వేడెక్కింది. పీహెచ్‌డీ స్కాలర్‌ రోహిత్‌ వేముల ఆత్మహత్య తర్వాత.. క్యాంపస్‌ వీడిన వీసీ.. తర్వాత దీర్ఘకాలిక సెలవు పై వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే.. మంగళవారం ఉదయం సెలవు ముగించుకున్న వీసీ తిరిగి విధులకు హాజరయ్యారు. దీనికితోడు ప్రశాంత వాతావరణం నెలకొందన్న కారణంగా ఆయన విధుల్లో చేరేందుకు వచ్చారు. దీంతో కోపోద్రిక్తులైన విద్యార్థులు వీసీ బంగ్లా వైపు దూసుకెళ్లారు. అప్పారావుకు వ్యతిరేకంగా ‘కిల్లర్‌ వీసీ గోబ్యాక్‌ అంటూ’ నినాదాలుచేశారు. దీంతో విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. . అప్పారావు రాకను నిరసిస్తూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఆయన వాహనంపై విద్యార్థులు దాడి చేశారు. వీసీ కార్యాలయంలోకి ప్రవేశించి ఫర్నీచర్‌ ధ్వంసం చేశారు. ఈ ఘటనతో పోలీసులు వర్శిటీ ప్రాంగణంలో భారీగా మోహరించారు. వీసీగా అప్పారావు బాధ్యతలు స్వీకరించటంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీసీ చాంబర్‌ ఎదుట విద్యార్థులు ఆందోళన చేపట్టారు. రోహిత్‌ ఆత్మహత్య కేసులో వీసీ అప్పారావుపై చర్యలు తీసుకోవాలని డిమాండు చేస్తూ విద్యార్థులు వీసీ ఇంటితోపాటు వీసీ కార్యాలయంపై దాడి చేశారు.  అప్పారావు వాహనంపై విద్యార్థి సంఘాలు దాడి చేశాయి. అప్పారావు డౌన్‌ డౌన్‌ అంటూ క్యాంపస్‌ లో నినాదాలు చేస్తూ విసి ఛాంబర్‌ వైపు దూసుకెళ్లారు..విసి ఛాంబర్‌ ను పూర్తిగా ధ్వంసం చేశారు..దీనిపై స్పష్టత ఇచ్చిన అప్పారావు విసిగా ఇంకా బాధ్యతలుతీసుకోలేదని, లాంగ్‌ లీవ్‌ పై వెళ్లిన తను అధికారులతో విూటింగ్‌ పెట్టేందుకు వచ్చానని తెలిపారు..యూనివర్శిటీలో కొందరు కావాలనే ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని ఆరోపించారు..ఆయన కార్యాలయంలోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేసి, వసతి గృహం అద్దాలను పగులగొట్టారు. ఉద్రిక్తతల నేపథ్యంలో హెచ్‌సీయూలో పోలీసులు భారీగా మోహరించారు. అధ్యాపకులను గదిలో బంధించి బయట గడియ పెట్టారు. ఇక విూడియా ప్రతినిధులపై కూడా విద్యార్థులు దాడి చేశారు. అధ్యాపకులు కూడా రెండు వర్గాలు చీలిపోయినట్లు సమాచారం. వీసీ అప్పారావుకు ఏబీవీపీ విద్యార్థులు మద్దతిస్తున్నట్లు సమాచారం. రోహిత్‌ తో పాటు మరో నలుగురి విద్యార్థులకు న్యాయం జరిగే వరకు అప్పారావును వర్సిటీలోకి రానివ్వమని వ్యతిరేక వర్గం విద్యార్థులు తేల్చి చెబుతున్నారు. అప్పారావు వీసీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇదిలా ఉండగా జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కఎన్‌యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్‌ కు హెచ్‌సీయూ అధికారులు వర్సిటీలో ప్రవేశానికి అనుమతి నిరాకరించారు. బుధవారం ఆయన హైదరాబాద్‌ రానున్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే ‘రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సదస్సు’లో ఆయన ప్రసంగించనున్నారు. అనంతరం రోహిత్‌ వేముల తల్లిని పరామర్శించిన తర్వాత నగరంలో నిర్వహించే బహిరంగ సభ, హెచ్‌సీయూలో సభ జరిపేందుకు విద్యార్థులు ప్రయత్నాలు చేస్తున్నారు. అధికారులు అనుమతించకున్నా సభ జరిపి తీరుతామని విద్యార్థులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.