భారత్‌కు ఐరాసలో శాస్వత సభ్యత్వం కల్పించాలి

4

భారత ప్రధాని మోదీ

ఒట్టోవా, ఏప్రిల్‌ 15(జనంసాక్షి) : విదేశీ పర్యటనలో భాగంగా ఫ్రాన్స్‌, జర్మనీల్లో పర్యటన ముగించుకున్న ప్రదాని మోడీ కెనడా చేరుకున్నారు. కెనడా రాజధాని ఒట్టోవాలో మోదీకి సాదర స్వాగతం లభించింది. కెనడా నుంచి యురేనియం దిగుమతిపై ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ఐదు సంవత్సరాల పాటు భారత్‌కు యురేనియం సరఫరా చేసేందుకు కెనడా అంగీకరించింది. కెనడా పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ గత కొన్నేళ్లుగా ఇరుదేశాల మధ్య పెండింగ్‌ లో ఉన్న పలు ఒప్పందాలపై చర్చించారు. మొత్తం 13 ఒప్పందాలపై ఇరు దేశాల అధికారులు సంతకాలు చేశారు. భారత్‌- కెనడాలు అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాలన్నారు ప్రధాని మోడీ. స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ పై కూడా పలు ఒప్పందాలు చేసుకున్నట్లు ప్రధాని చెప్పారు. అణు విద్యుత్‌ ప్లాంట్లకు కెనడా నుంచి యురేనియం సేకరణ ఒప్పందం ద్వైపాక్షిక సహకారానికి నాంది అన్నారు. ఇరు దేశాల మధ్య బంధం మరింత బలపడుతుందని, టెర్రరిజంపై కలిసి పోరాడుతామన్నారు. అంతేకాక భారత్‌కు ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వం ఇవ్వాల్సిన అవసరం ఎంతో ఉందని, దాన్ని సాధించి తీరతామని ఆశాభావం వ్యక్తంచేశారు.