భారత్ జోడో యాత్రను విజయవంతం చేయండి..
టీపీసీసీ ఉపాధ్యక్షుడు సురేష్ షెట్కార్..
పెద్ద శంకరంపేట : జనం సాక్షి అక్టోబర్ 20
రాహుల్ గాంధీ చేపడుతున్న భారత్ జోడో యాత్రను విజయవంతం చేయాలని టిపిసిసి ఉపాధ్యక్షుడు సురేష్ షెట్కర్ పిలుపునిచ్చారు.. నారాయణఖేడ్ నియోజకవర్గం లోని పెద్ద శంకరంపేట మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. అందుతున్న సమాచారం ప్రకారం వచ్చేనెల 6 తేదీ నుండి నారాయణఖేడ్ నియోజకవర్గం లో పెద్ద శంకరంపేట మండలం నుండి భారత్ జోడో యాత్ర ప్రారంభమవుతుందని అన్నారు.. ఈ యాత్ర పెద్ద శంకరంపేట మండలంలోని కమలాపూర్ నుండి నిజాంపేట్ మీదుగా మాసంపల్లి వరకు నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగుతుందన్నారు.. ఏఐసీసీ ఇన్చార్జ్ మాణిక్యం టాగూర్ ఇదివరకే ఈ రోడ్ మ్యాప్ పరిశీలించడం జరిగిందన్నారు.. ఉదయం 6:30 నుండి 11 గంటల వరకు విరామం తర్వాత మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 7:20 నిమిషాల వరకు పాదయాత్ర కొనసాగుతుందని అన్నారు.. భారత్ జోడోయాత్రకు నియోజకవర్గం నుంచి 50 వేల నుండి 60 వేల వరకు పాదయాత్రలో పాల్గొనేలా కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు కృషి చేయాలన్నారు.. నియోజకవర్గంలోని అన్ని మండలాల నుండి ప్రతి ఊరు నుంచి యువకులు పాల్గొనేలా నాయకులు సమీకరణ చేయాలని అన్నారు.. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు నగేష్ షెట్కార్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాయిని మధు, నాయకులు జనార్ధన్, జైహింద్ రెడ్డి, గంగారెడ్డి, రాందాస్, మైపాల్ గౌడ్ అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు..