భారీ యంత్రాల తయారీ పరిశ్రమలు స్థాపించండి

5
సీఎం కేసీఆర్‌తో హిటాచీ ప్రతినిధుల భేటీ

హైదరాబాద్‌,మే23(జనంసాక్షి): తెలంగాణలో త్వరలో కొత్త పారిశ్రామిక విధానం అమలు చేస్తామని  ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. శనివారం ఆయన హిటాచీ కంపెనీ ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ… హైదరాబాద్‌లో పరిశ్రమల స్థాపనకు వసతులు కల్పించామన్నారు. విద్యుత్‌, భూమి, ఇతర మౌలిక సదుపాయాలతో కొత్త పారిశ్రామిక విధానం, సింగిల్‌ విండో అనుమతులకు కృషి చేస్తున్నామని అన్నారు.  వివిధ రంగాల్లో స్మార్ట్‌కార్డ్‌ విధానం ప్రవేశపెట్టేలా చూడాలని హిటాచీని కేసీఆర్‌ కోరారు. వరంగల్‌, ఖమ్మం, కరీంనగర్‌ అభివృద్ధికి సహకరించాలని, రాష్ట్రంలో భారీ యంత్ర పరిశ్రమను స్థాపించాలని ఆ సంస్థ ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. విద్య, వైద్య, స్మార్ట్‌కార్డ్‌ విధానంలో ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని హిటాచీ సంస్థ ప్రతినిధులు ఈ సందర్భంగా తెలిపారు. వచ్చే ఆగస్టు నుంచి రాష్ట్రంలో కార్యకలాపాలు ప్రారంభిస్తామని, హైదరాబాద్‌ను స్మార్ట్‌ సిటీగా మార్చేందుకు తమవంతు కృషి చేస్తామని హావిూ ఇచ్చారు.ఈ సందర్భంగా తెలంగాణలో పెట్టుబడులపై హిటాచీ ప్రతినిధులు సీఎంతో చర్చించారు. హిటాచీ ప్రతినిధులు మాట్లాడుతూ.. వచ్చే ఆగస్టు నుంచి రాష్ట్రంలో కార్యకలాపాలు ప్రారంభిస్తామని తెలిపారు. విద్య, వైద్య, స్మార్ట్‌కార్డ్‌ విధానంలో ప్రభుత్వంతో కలిసి పని చేస్తామని చెప్పారు. హైదరాబాద్‌ను స్మార్ట్‌సిటీగా మార్చేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు. రాష్ట్రంలో భారీ యంత్ర పరికాల పరిశ్రమను స్థాపించాలని హిటాచీని సీఎం కోరారు. వరంగల్‌, ఖమ్మం, కరీంనగర్‌ అభివృద్ధికి సహకరించాలన్నారని తెలిపారు.