భార్యను కొట్టి చంపిన కేసులో భర్త అరెస్ట్, రిమాండ్ కు తరలింపు

గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 22 (జనం సాక్షి);
జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణం వెంకట్రామణ కాలనీ చెందిన బోయ నర్సింహులు ఆలియాస్ నర్సింహులు ను భార్యను కొట్టి చంపిన కేసులో అరెస్టు చేసి రిమాండ్ తరలించినట్లు గద్వాల సర్కిల్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు.
గద్వాల మండల పరిధిలోని ముల్కలపల్లి గ్రామానికి చెందిన బోయ జానకి( 26)గద్వాల పట్టణానికి చెందిన బోయ నర్సింహులు తో గత 9 నెలల కింద వివాహమైందని, భార్య భర్తలు ఇరువురు పెళ్లయిన మూడు నెలల వరకు మంచిగా ఉన్నారని, భార్యపై అనుమానం పెంచుకున్న బోయ నర్సింలు తరచు తన భార్యతో గొడవ పెట్టుకొని మానసికంగా,
శారీరకంగా వెధించేవాడని, గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ కూడా జరిగిందని పెద్దమనుషులు సర్ది చెప్పి పంపించారని అయినా గాని నరసింహులు తన పరివర్తన మార్చుకోకుండా భార్యని అదే విధంగా అవమానిస్తూ హింసించేవాడని, ఈ విషయంపై గొడవపడి ఈనెల 15న ఆమె తల ఎడమ కన్ను భాగం కనితిపై ఇనుపరాడుతో కొట్టగా బలమైన రక్త గాయం అయిందని అపస్మారక స్థితికి వెళ్లిందని చుట్టుపక్కల వారి సమాచారం మేరకు ఆమె తరపున బంధువులు వచ్చి గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొని పోగా అక్కడ డాక్టర్లు పరీక్షలు మెరుగైన చికిత్స నిమిత్తం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కర్నూలుకు తీసుకుపోమని చెప్పగా వారి యొక్క సూచన మేరకు కర్నూలు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ తీసుకొని పోయినట్లు మృతురాలు అన్న శ్రీనివాసులు గద్వాల టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారని మృతురాలు మెరుగైన వైద్యం గురించి కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రి నుండి సంజీవని ప్రవేట్ హాస్పిటల్ తీసుకొని పోగా ఈనెల 18న ఆమె చనిపోయిందని ఈ విషయంలో జిల్లా ఎస్పీ రంజన్ రతన్ కుమార్ ఆదేశాల మేరకు అదనపు ఎస్పి రాములు నాయక్, డిఎస్పి ఎన్ సిహెచ్ రంగస్వామి సూచన మేరకు విచారణ చేపట్టి హత్య కేసుగా మార్చి బోయ నర్సింహులను అదుపులోనికి తీసుకొని గద్వాల కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్ తరలించడం జరిగిందని గద్వాల సీఐ చంద్రశేఖర్ తెలిపారు.